NeoCov: కొత్త వేరియంట్‌తో వినాశనం: ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి: చైనా సైంటిస్టుల వార్నింగ్
బీజింగ్: రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ వేరియంట్.. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. సరికొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. కరోనా వైరస్ బలహీనపడుతోందనుకున్న ప్రతీ సందర్భంలోనూ కొత్త వేరియంట్ పుట్టుకొస్తోంది. జనాలను హడలెత్తిస్తోంది. ఇదివరకు డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు భయాందోళనలకు గురి చేశాయి. దాన్ని తీవ్ర తగ్గిందనుకునే సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తిలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కొత్త రూపంతో పంజా విసరడం మొదలు పెట్టింది.
కొత్తగా కరోనా వైరస్ వేరియంట్ నియోకోవ్ (NeoCov) వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాలో దీన్ని గుర్తించారు చైనా శాస్త్రవేత్తలు, ఇదివరకు ఒమిక్రాన్ వేరియంట్‌ను మొదటిసారిగా గుర్తించింది కూడా దక్షిణాఫ్రికాలోనే. డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ కంటే ఈ నియోకోవ్ అత్యంత ప్రమాదకరమైదనది వుహాన్ సైంటిస్టులు ప్రకటించారు. దీని తీవ్రత ఊహకు అందని స్థాయిలో ఉండొచ్చని స్పష్టం చేశారు. అత్యధిక స్థాయిలో మరణాల రేటును నమోదు చేసే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు.
వ్యాప్తి చెందే విషయంలోనూ ఒమిక్రాన్ కంటే వేగవంతమైనదని వుహాన్ యూనివర్శిటీ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్ ఆఫ్ ది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సైంటిస్టులు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని రష్యాకు చెందిన న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్, టాస్ వెల్లడించాయి. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించాయి. నియోకోవ్ వైరస్.. పీడీఎఫ్-2180-సీఓవీ రకానికి చెందినదని వుహాన్ సైంటిస్టులను తమ కథనంలో ఉంటికించాయి. ఈ వేరియంట్ కూడా మనుషుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సార్స్-కోవ్-2 రకంతో సరిపోలుతుందని సైంటిస్టులు నిర్ధారించారు.

తొలుత దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో వుహాన్ సైంటిస్టులు ఈ రకం వేరియంట్‌ను గుర్తించారు. దీనికి చెందిన ఒక మ్యుటేషన్ జంతువుల నుంచి కూడా మనుషులకు సోకుతుందని, ఇదివరకు ఈ తరహా లక్షణాలు కరోనా వైరస్‌లో ఉండేవి కావని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌లో ఉండే పాథోజెన్‌కు భిన్నంగా మరింత ప్రమాదకరంగా ఇది పరిణించే అవకాశాలు లేకపోలేదని సైంటిస్టులు అంచనా వేశారు.
యాంటీబాడీస్ లేదా ప్రొటీన్లను సైతం నియోకోవ్ నుంచి రక్షణ కల్పించలేదని అభిప్రాయపడ్డారు. హై పొటెన్షియల్ కాంబినేషన్‌ను కలిగి ఉండటం వల్ల.. దీని బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశం ఉందని వుహాన్ సైంటిస్టులు పేర్కొన్నారు. సార్స్ సీఓవీ 2 కరోనావైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉందనేది నిర్దారణ అయినట్లు చెప్పారు.