వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో అత్యంత చెత్త, ఉత్తమ ఉద్యోగాలు ఇవే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అత్యంత చెత్త ఉద్యోగం న్యూస్ రిపోర్టర్, డాటా సైంటిస్ట్ ఉద్యోగం మంచి ఉద్యోగంగా ఓ సర్వేలో తేలింది. అమెరికాకు చెందిన జాబ్స్ వెబ్ సైట్ 'కెరీర్ కాస్ట్' 200 ఉద్యోగాలపై సర్వే చేసింది. 28వ వార్షిక ఉద్యోగాల రేటింగ్ రిపోర్టును కెరీర్ కాస్ట్ విడుదల చేసింది.

పని వాతావరణం, ఆదాయం, దృష్టి కోణం, ఒత్తిడి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని రేటింగ్ ఇచ్చింది. ఇందులో న్యూస్ రిపోర్టర్ ఉద్యోగం వరుసగా మూడో ఏడాది అత్యంత చెత్త ఉద్యోగంగా నిలిచింది. న్యూస్ పేపర్ రిపోర్టర్ వార్షిక వేతనం 37,200 డాలర్లుగా గుర్తించింది.

 Newspaper reporter's job the worst, US survey says

దశాబ్దకాలంగా ప్రింట్ మీడియా క్రేజ్ తగ్గుతూ వస్తోందని, ఈ ప్రభావం సిబ్బంది పైనా పడుతోందని సర్వే వెల్లడించింది. వాణిజ్య ప్రకటనల ఆదాయం బాగా తగ్గడం ప్రింట్ మీడియా కుంగుబాటుకు కారణమని తెలిపింది.

న్యూస్ రిపోర్టర్ తర్వాత చెదలు, బొద్దింకలను నియంత్రించే పని, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుటు సహాయక చర్యలు చేపట్టే ఫైటర్, సైనికుడిగా పని చేయడం.. ఆ తర్వాత చెత్త ఉద్యోగాల జాబితాలో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎనలిస్ట్, ఆడియోలాజిస్ట్, డయాగ్నస్టిక్ మెడికల్ సోనోగ్రాఫర్ ఉత్తమ ఉద్యోగాల జాబితాలో ఉన్నాయి.

English summary
For the third year in a row, the job of a newspaper reporter has been ranked as the worst profession, according to a survey which listed data scientist as the best job after a review of 200 careers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X