వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లికూతురు కాబోతున్న న్యూజిలాండ్ ప్రధాని: అతనితోనే జేసిందా వివాహం

|
Google Oneindia TeluguNews

న్యూజిలాండ్ ప్రధాని జేసిందా అర్డెన్ త్వరలోనే పెళ్లికూతురు కాబోతోంది. గత కొంత కాలంగా ప్రముఖ టీవీ వ్యాఖ్యాత క్లార్క్ గేఫోర్డ్‌తో ఆమె ప్రేమలో ఉన్నారు. వారిద్దరికి నెవె టెఅరోహా అనే 10 నెలల కూతురు కూడా ఉంది. వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ అయినట్లు ప్రధాని జేసిందా అర్డెన్ అధికార ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. జేసిందా దేశ వ్యవహారాలు చూస్తుండగా... చిన్నారి ఆలనాపాలనా గేఫోర్డ్ చూసుకుంటారు.

2018లో జేసిందా గర్భం దాల్చి ఉన్న సమయంలో కూడా దేశ వ్యవహారాలను చూసుకుంది. ఆ సమయంలో అందరూ ఆమెను ప్రశంసించారు. మహిళా శక్తి అంటే ఇదే అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. దేశం ఒక మహిళానేత నాయకత్వంలో అభివృద్ధి పథాన దూసుకెళుతోందంటూ చాలా మంది వ్యాఖ్యానించారు. ఒక దేశానికి ప్రధాని హోదాలో ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన వారిలో జేసిందా రెండవ మహిళగా నిలిచారు. అంతకుముందు అంటే 1990లో నాటి పాకిస్తాన్ ప్రధాని బేనజీర్ బుల్లో బిడ్డకు జన్మనిచ్చారు. ఓ సారి జేసిందా లండన్‌కు వెళ్లిన సమయంలో ఓ అంతర్జాతీయ వార్తా ఛానెల్ ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగింది. తనను వివాహమాడమని గేఫోర్డ్‌ను అడుగుతారా లేక ఆయనే ప్రపోజ్ చేసేవరకు వేచిచూస్తారా అని ప్రశ్నించింది.

Newzealand PM Jacinda gets engaged to tv host Clarke Gayford

వార్తా ఛానెల్ అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇచ్చారు జేసిందా. తను ముందుగా ఒక మహిళను అని చెప్పిన జేసిందా... గేఫోర్డ్ ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉందని అన్నారు. తను ప్రపోజ్ చేసే వరకు వేచి ఉంటానంటూ జోక్ చేశారు. ఇదిలా ఉంటే జేసిందాకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని ఓ జర్నలిస్టు కనిపెట్టారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న జేసిందా తన వేలికి ఉంగరాన్ని ధరించి ఉండటాన్ని ఓ జర్నలిస్టు గమనించడంతో అసలు సంగతి వెలుగు చూసింది. అయితే జేసిందా ఈస్టర్ నాటి నుంచే ఉంగరం ధరిస్తోందంటూ గేఫోర్డ్ జేసిందాలకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని ఆమె అధికార ప్రతినిధి ఆండ్రూ క్యాంబెల్ ధృవీకరించారు.

English summary
New Zealand Prime Minister Jacinda Ardern is engaged to her longtime partner Clarke Gayford after a proposal over the Easter holidays, her spokesman said on Friday.Gayford, the 41-year-old host of a TV fishing show, takes care of their ten-month-old daughter Neve Te Aroha, while Ardern, 38, runs the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X