వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త చరిత్ర: ఐక్యరాజ్యసమితిలో చంటిబిడ్డతోపాటు హాజరైన న్యూజిలాండ్ ప్రధాని జేసిండా

|
Google Oneindia TeluguNews

ఒక దేశానికి ప్రధానిగా ఉన్న సమయంలోనే బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా చరిత్రకెక్కిన న్యూజిలాండ్ ప్రధాని జేసిండా ఆర్డన్... తాజాగా ఆ బిడ్డతోపాటే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై మరో రికార్డు నెలకొల్పారు. మూడునెలల పాప నెవె టి అరోహ కూడా తొలిసారిగా ఐక్యరాజ్యసమితి భవనంలో అడుగుపెట్టి రికార్డు సృష్టించింది.

ఇది మిమ్మల్ని అబ్బురపరుస్తుంది: బాతుల కోసం 3లైన్లలో నిలిచిన ట్రాఫిక్ (వీడియో)ఇది మిమ్మల్ని అబ్బురపరుస్తుంది: బాతుల కోసం 3లైన్లలో నిలిచిన ట్రాఫిక్ (వీడియో)

బేబీని ముద్దాడుతూ కనిపించిన జేసిండా

బేబీని ముద్దాడుతూ కనిపించిన జేసిండా

ఐక్యరాజ్య సమితి భవంతిలోకి ప్రవేశించగానే తన గారాలపట్టిని న్యూజిలాండ్ ప్రధాని జేసిండా ముద్దాడుతూ, చిన్నారిని గాల్లోకి ఎగిరేస్తూ పట్టుకుంటూ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. చిన్నారితో ఆడుతున్న సమయంలో చుట్టుపక్కల కెమెరాలు ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించాయి. జేసిండా తన భర్త క్లార్క్ గేఫోర్డ్‌తో కలిసి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత జేసిండా నెల్సన్ మండేలా శాంతి సమాఖ్యలో ప్రసంగించారు.

చిన్నారి బాగోగులన్నీ భర్త క్లార్క్ గేఫోర్డ్ చుసుకుంటాడు

చిన్నారి బాగోగులన్నీ భర్త క్లార్క్ గేఫోర్డ్ చుసుకుంటాడు

జేసిండా భర్త క్లార్క్ గేఫోర్డ్ ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. జేసిండా తన కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో బిడ్డ బాగోగులన్నీ భర్త గ్రేఫోర్డ్ చూస్తుంటాడు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జేసిండా ప్రసంగిస్తుండగా బిడ్డతో పాటు ఇతర కివీస్ ప్రతినిధులతో గ్యాలరీలో కూర్చొని తన భార్య ప్రసంగాన్ని విన్నారు గ్రేఫోర్డ్జేసిండా-గ్రేఫోర్డ్ దంపతులు గారాల పట్టి నెవెకు ఐక్యరాజ్య సమితి ఇచ్చిన డిప్లొమాటిక్ ఫోటో ఐడీని సోషల్ మీడియాలో గ్రేఫోర్డ్ పోస్ట్ చేశారు. న్యూజిలాండ్ మొదటి బేబీ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

చిన్నారిని ఐక్యారాజ్య సమితిలో చూడటం ఆనందంగా ఉంది: స్టీఫెన్

చిన్నారిని ఐక్యారాజ్య సమితిలో చూడటం ఆనందంగా ఉంది: స్టీఫెన్

ఇదిలా ఉంటే న్యూజిలాండ్ ప్రధానిగా అతి పిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టి జేసిండా ఒక రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు ఒక ప్రధానిగా ఉన్న సమయంలో మెటర్నటీ సెలవుపై వెళ్లిన తొలి మహిళ కూడా జేసిండా కావడం విశేషం. బేబీ నెవెను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చూడటం చాలా ఆనందం కలిగించిందని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. పనిచేస్తున్న తల్లుల్లో తనకంటే ఎవరూ అంత బాగా పనిచేయలేరనే దానికి జేసిండానే ఉదాహరణ అని స్టీఫెన్ డుజారిక్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5శాతం మందే మహిళా నేతలు ఉన్నారన్న స్టీఫెన్ ...వారిని అత్యున్నతంగా గౌరవించుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Recommended Video

ఐక్యరాజ్యసమితి సదస్సులో...తెలుగులో చంద్రబాబు తొలిపలుకులు

English summary
New Zealand Prime Minister Jacinda Ardern is the first female world leader to bring an infant to the United Nations General Assembly (UNGA). Ardern, 38, is also the second ever world leader to give birth while in office after Pakistan's Benazir Bhutto in 1990.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X