వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ కాంట్రవర్సీ : అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఫోటోపై దుమారం.. భగ్గుమంటున్న అమెరికా హిందూ సంఘాలు..

|
Google Oneindia TeluguNews

ఎన్నికల వేళ పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతలను ఆరాధ్య దేవతలతో పోల్చడం,ఆ రూపంలో వారికి కటౌట్లు ఏర్పాటు చేయడం వంటివి భారత్‌లో కామన్. అభిమానం పీక్స్‌కి వెళ్లి నాయకులకు గుళ్లు కట్టిన సందర్భాలు కూడా దేశంలో చాలానే ఉన్నాయి. అయితే ఇది భారత్‌కే పరిమితం కాలేదు. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ.. అభ్యర్థులను హిందూ దేవతామూర్తులతో పోలుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం. డెమోక్రాటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ దుర్గా దేవి రూపంలో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై హిందూ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

క్షమాపణ చెప్పాలన్న డిమాండ్...

క్షమాపణ చెప్పాలన్న డిమాండ్...

కమలా హ్యారిస్ మేనకోడలు,న్యాయవాది,ఫినామినల్ విమెన్ యాక్షన్ క్యాంపెయిన్ వ్యవస్థపాకురాలు మీనా హ్యారిస్(35) ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అందులో దుర్గా దేవి రూపంలో ఉన్న కమలా హ్యారిస్... రాక్షసుడైన మహిషాసురుడి రూపంలో ఉన్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను శూలంతో పొడిచి చంపుతున్నట్లు కనిపిస్తోంది.అయితే ఈ ఫోటోపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా స్పందించింది. 'హిందూ దేవతామూర్తి ఫోటోను ఇతరుల ముఖ చిత్రాలతో క్యారికేచర్‌లా మలచడం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. కాబట్టి మీనా హ్యారిస్ హిందువులకు క్షమాపణలు చెప్పాలి.' అని ఆ సంస్థ డిమాండ్ చేసింది. హిందూ మత దేవతా మూర్తుల చిత్రాలను కమర్షియల్‌గా ఉపయోగించుకోవడానికి సంబంధించి పలు స్పష్టమైన మార్గదర్శకాలను ఆ సంస్థ విడుదల చేసింది.

నిజానికి అది వైరల్ ఫోటో...

నిజానికి అది వైరల్ ఫోటో...

వివాదం ముదురుతుండటంతో మీనా హ్యారిస్ ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించక తప్పలేదు. మరోవైపు హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యుడు రిషి భుటాడా ఈ వివాదంపై స్పందిస్తూ... నిజానికి ఆ ఫోటో మీనా హ్యారిస్ సృష్టించింది కాదన్నారు. వాట్సాప్‌లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్న ఫోటోనే ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిందన్నారు. అయినప్పటికీ మీనా హ్యారిస్ క్షమాపణలు చెబుతారని భావిస్తున్నానన్నారు. అమెరికన్ పాలిటిక్స్ కోసం మన ఆదర్శ దేవతా మూర్తుల ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవద్దన్నారు.

క్షమాపణ చెప్పకుండా డిలీట్...

క్షమాపణ చెప్పకుండా డిలీట్...

అమెరికన్ హిందూ కన్వీనర్ అజయ్ షా మాట్లాడుతూ... ఆ ఫోటో హిందువుల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చిందన్నారు. ప్రముఖ రచయిత్రి షెఫాలి వైద్య మాట్లాడుతూ.. 'మమ్మల్ని కించపరిచేలా వ్యవహరిస్తూ.. ఈ ఎన్నికల్లో హిందువుల ఓట్లను గెలుచుకుంటామని భావిస్తున్నారా... మరోసారి దీనిపై ఆలోచించండి. మీరు షేర్ చేసిన ఫోటో హిందువులను తీవ్రంగా అవమానించేలా ఉంది. మా దైవత్వంపై మీ ఎగతాళి,చిన్నచూపు సరికాదు. క్షమాపణ చెప్పకుండా ఆ ఫోటోను తొలగించడమేంటి..?' అని ప్రశ్నించారు.

Recommended Video

US Election 2020 : Ivanka Is More Fit To Be First Female President Than Kamala Harris - Donald Trump
వివాదం మరింత ముదురుతుందా?

వివాదం మరింత ముదురుతుందా?

తాను షేర్ చేసిన ఫోటోపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మీనా హ్యారిస్ స్పందించారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు తానేమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నానన్నారు. అయితే మీనా హ్యారిస్ క్షమాపణ చెప్పకపోవడంతో... ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. మరోవైపు దుర్గా నవరాత్రుల నేపథ్యంలో కమలా హ్యారిస్,జో బైడైన్ హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ లాగే అమెరికా ఎన్నికల్లోనూ చెడుపై మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

English summary
A controversy was triggered after Meena Harris, the niece of United States Democratic Vice-Presidential candidate Kamala Harris, tweeted an image depicting the latter as Goddess Durga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X