వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాపింగ్‌కు వెళ్తున్నారా! జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి (వీడియో)

|
Google Oneindia TeluguNews

లండన్ : షాపింగ్ మాల్స్ కు వెళ్తున్నారా! అయితే ఏమరపాటును పక్కనబెట్టి.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చిన్న చిన్న వస్తువులను పగలగొడితే.. వందో, రెండు వందలతోనో సరిపెట్టుకోవచ్చు గానీ, లక్షల విలువచేసే వస్తువులను డ్యామేజ్ చేస్తే.. మీ జేబులు ఖాళీ అయిపోవడమే కాదు, అప్పులు చేసి మరీ ఆ డ్యామేజ్ కు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

తాజాగా ఇలాంటి ఘటనే బ్రిటన్ లోని ఓ ఎలక్ట్రానిక్ షాపింగ్ మాల్ లో చోటు చేసుకుంది. మాల్స్ లో అటు ఇటు తచ్చాడిన ఓ కస్టమర్.. టీవీల వద్దకు వెళ్లి వాటిని పరిశీలిస్తుండగా.. పొరపాటున ఓ టీవిని కిందపడేశాడు. అయితే ఆ టీవి కాస్త మరో టీవి మీద పడడం.. బెదిరిపోయిన సదరు కస్టమర్ వెనక్కి జరగడంతో.. ఆ వెనకాల ఉన్న మరో రెండు టీవీలు కూడా బద్దలైపోవడం క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి.

అంతా అయిపోయాక.. తలపట్టుకుని.. నోరెళ్లబెట్టి మాల్స్ సిబ్బంది వైపు ధీనంగా ఓ లుక్కేశాడు. అయితే మాల్స్ యాజమాన్యం మాత్రం డ్యామేజ్ లో అతని వంతు వాటాను కక్కించింది. ఒక్కో టీవి రూ.4లక్షల విలువ చేసేది కావడంతో.. పొరపాటు అని సరిపెట్టుకోలేం కాబట్టి, తప్పనిసరిగా కస్టమర్ వంతు వాటాను వసూలు చేయాల్సి వచ్చిందని సదరు యాజమాన్యం వెల్లడించింది. బ్రిటన్ లో పేరుమోసిన ఎలక్ట్రానిక్ కంపెనీ హెచ్.బీహెచ్ సంస్థలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాగా, ఈ వీడియోను కూడా ఆ కంపెనీయే యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. అక్టోబర్ 13న అప్ లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటిదాకా 31లక్షల మంది వీక్షించారు. ఏదేమైనా.. ఈ వీడియో చూశాక.. మాల్స్ లో తిరగాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మసులుకోకపోతే బిగ్ డ్యామేజీ తప్పదంటున్నారు నెటిజెన్స్.

English summary
It was disaster times four at the electronics store HBH Woolacotts in UK when a customer, casually browsing, accidentally smashed TV sets worth 5,000 pounds (over Rs. 400,000). Cue in the collective gasps now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X