వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలి రాజీనామా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారతసంతతికి చెందిన నిక్కీ హేలీ ఆ పదవికి మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినట్టు తెలిసింది.

అంతకుముందు, డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్‌లో 'నా ఫ్రెండ్ అంబాసిడర్ నిక్కీ హేలీ ఉదయం 10.30 గంటలకు ఓవెల్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన చేయబోతున్నారు' అని పేర్కొనడం గమనార్హం. నిక్కీ హేలీ.. ట్రంప్ కీలక అనుచరుల్లో ఒకరు.

నిక్కీ హేలీని తొలగిస్తాం: భారత సంతతి మహిళపై ట్రంప్ జోక్! నిక్కీ హేలీని తొలగిస్తాం: భారత సంతతి మహిళపై ట్రంప్ జోక్!

Nikki Haley resigns as US Ambassador to the UN

ఇండియన్ అమెరికన్ అయిన నిక్కీ హేలీని 2016 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించారు. ఈ పదోన్నతితో అమెరికా యంత్రాంగంలో కేబినెట్ స్థాయి పదవికి నియమితురాలైన తొలి ఇండో-అమెరికన్‌గా నిక్కీ రికార్డు సృష్టించారు.

నిక్కీ హేలీ గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేశారు. సౌత్ కరోలినా గవర్నర్‌గా వాణిజ్యం, కార్మిక అంశాలపై ఆమె విశేష కృషి చేశారు. అయితే, నిక్కీ హేలీ రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

English summary
Nikki Haley has resigned as the United States' Ambassador to the United Nations, said reports. US President Donald Trump has reportedly accepted Haley's resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X