వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధమొస్తే! ఉ.కొరియా సర్వనాశనమే, కిమ్‌ను బతకనివ్వం: అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: యుద్ధానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియాపై అమెరికా మరోసారి తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఎంత చెప్పినా వినకుండా.. వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా యుద్ధానికి రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Recommended Video

US Envoy Nikki Haley over North Korea కిమ్ జాంగ్ కు యుద్దం ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు

ఒక వేళ యుద్ధమే వస్తే మాత్రం ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. ఉత్తరకొరియా తాజా క్షిపణి ప్రయోగంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

 ఉ. కొరియా సర్వనాశనమే..

ఉ. కొరియా సర్వనాశనమే..

ఈ సమావేశంలో యూఎన్‌లో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ‘ఒక వేళ యుద్ధం వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు. ఉత్తరకొరియాను సర్వనాశనం చేస్తాం' అని హెచ్చరించారు.

 యుద్ధానికి దగ్గరగా..

యుద్ధానికి దగ్గరగా..

‘ఉత్తర కొరియా నియంత (కిమ్ జోంగ్ ఉన్) యుద్ధాన్నే ఎంచుకుంటున్నారు. మాకు ఇప్పటికీ యుద్ధం చేయాలనే ఆలోచన లేదు. కానీ, ఆ దేశం యుద్ధానికి దగ్గరగా వస్తోంది' అని హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కఠినతరం చేయాలి..

కఠినతరం చేయాలి..

‘ఉత్తర కొరియాతో అన్ని దేశాలు సంబంధాలను తెంచుకోవాలి. ఐక్యరాజ్యసమతి భద్రతా మండలి పెట్టిన ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ అమలు చేయాలి. ఆ దేశంతో ఉన్న ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలకు ముగింపు పలకాలి' అని నిక్కీ హేలీ డిమాండ్‌ చేశారు. అంతేగాక, ఇంతకుముందు ఉత్తరకొరియాకు ఆయిల్ సరఫరా చేయవద్దని చైనాను కోరారు.

 క్షిపణి ప్రయోగంతో అమెరికా టార్గెట్

క్షిపణి ప్రయోగంతో అమెరికా టార్గెట్

దాదాపు రెండు నెలల తర్వాత ఉత్తరకొరియా తాజాగా బుధవారం ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు కిమ్‌ దేశం ప్రకటించింది. సంబరాలు చేసుకుంది. కాగా, ఈ క్షిపణితో మొత్తం ఉత్తర అమెరికా ఖండం తమ క్షిపణి పరిధిలోకి వచ్చిందని ఉత్తరకొరియా పేర్కొంది.

పెనుముప్పే, సహనం నశించింది: కిమ్ జోంగ్‌పై ట్రంప్ ఆగ్రహం, జపాన్ ఫుల్ ‌సపోర్ట్పెనుముప్పే, సహనం నశించింది: కిమ్ జోంగ్‌పై ట్రంప్ ఆగ్రహం, జపాన్ ఫుల్ ‌సపోర్ట్

కొరియా వర్సెస్ కొరియా

కొరియా వర్సెస్ కొరియా

కాగా, ఉత్తరకొరియా తాజా క్షిపణి ప్రయోగంపై అమెరికా సహా దక్షిణకొరియా, జపాన్‌ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టిన గంటల వ్యవధిలోనే దక్షిణ కొరియా కూడా క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియాకు ధీటుగా సమాధానం చెప్పడానికే ఈ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

కిమ్‌ను చంపేస్తాం

కిమ్‌ను చంపేస్తాం

ఇది ఇలావుంటే.. బుధవారం రిపబ్లికన్ సెనెటర్ స్టీవ్ రస్సెల్ మాట్లాడుతూ.. ఒక వేళ ఉత్తరకొరియా యుద్ధానికి సిద్ధమైతే.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను ఖచ్చితంగా చంపేస్తామని హెచ్చరించారు. అమెరికా తన రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తే ఉత్తరకొరియా తట్టుకోలేదని స్పష్టం చేశారు.

English summary
Nikki Haley says North Korean regime "will be utterly destroyed" if war comes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X