వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-అమెరికాకు ఆకాశమే హద్దు, మోడీ-ట్రంప్ కాంబినేషన్ సూపర్: నిక్కీ హేలీ ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌లో తీసుకొస్తున్న శక్తిమంతమైన ఆర్థిక, సంస్థాగత సంస్కరణల పట్ల ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు.

భారత్‌తో అమెరికా సంబంధాలు బాగా పెరుగుతుండడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా ఇష్టపడుతున్నారని నిక్కీ హేలీ స్పష్టంచేశారు. అంతేగాక, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఆకాశమే హద్దు అని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్‌ సింగ్‌ సర్నా తన నివాసంలో ఏర్పాటు చేసిన విందులో ఆమె పాల్గొన్నారు.

ఒకే రకమైన విలువలు

ఒకే రకమైన విలువలు

కొందరు ప్రముఖ భారతీయ అమెరికన్లతో జరిగిన ఈ విందు సమావేశంలో హేలీ భారత్‌తో సత్సంబంధాల గురించి మాట్లాడారు. ఇరు ప్రజాస్వామ్య దేశాలకు చాలా విషయాల్లో ఒకేరకమైన విలువలున్నాయని.. ఇవి రెండు దేశాలు కలిసి పనిచేయడానికి సహకరిస్తున్నాయని నిక్కీ హేలీ అన్నారు.

అందుకు హేలీ గర్వపడుతారు

అందుకు హేలీ గర్వపడుతారు

భారత మూలాలున్న నిక్కీ హేలీ.. ఈ విషయంలో గర్వపడతారని భారత రాయబారి నవ్‌తేజ్‌ వ్యాఖ్యానించారు. అమెరికా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న హేలీ ఇండో అమెరికన్‌ సంబంధాలకు అధిక ప్రాధాన్యమిస్తారని తెలిపారు.

ఓ స్టార్.. భారత్‌తో సంబంధాలు

ఓ స్టార్.. భారత్‌తో సంబంధాలు

ట్రంప్‌ యంత్రాంగంలో నిక్కీ ఓ స్టార్‌ అని నవ్‌తేజ్ కొనియాడారు. తాను ట్రంప్‌ యంత్రాంగంలోకి అడుగుపెట్టగానే అమెరికా-భారత్‌ల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉండాలని కోరుకున్నానని ఈ సందర్భంగా హేలీ తెలిపారు.

వారిద్దరి మంచి కాబినేషన్

వారిద్దరి మంచి కాబినేషన్

అంతేగాక, విలువలు, పని విధానం, కార్పొరేట్‌ విధానంలో ఇరు దేశాలు ఒకే విధంగా ఆలోచిస్తున్నాయని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. ఈ కారణాలతోనే ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలపడుతోందన్నారు. ఇరు దేశాల సత్సంబంధాలు పెరగుతుండడం పట్ల ట్రంప్‌కు సంతోషంగా ఉందని వెల్లడించారు. ట్రంప్‌-మోడీలది చాలా మంచి కాంబినేషన్‌ అని హేలీ తెలిపారు. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ అమెరికా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Praising Prime Minister Narendra Modi for being aggressive in pursuing economic and administrative reforms, the US Ambassador to the United Nations, Nikki Haley, said that "sky is the limit" for India-US ties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X