వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9 రోజుల ముందు అనూహ్య మార్పులు: 2016 కంటే పెరిగిన అమెరికా అధ్యక్ష ఎర్లీ ఓటింగ్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో 9 రోజుల్లో జరగబోతున్నాయి. అయితే 2016 ఎన్నికల కంటే ముందస్తు ఓటింగ్ పెరిగాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఎర్లీ ఓటింగ్ ట్రెండింగ్ పెరిగింది. బ్యాలెట్ ఓటు వేయడం కంటే.. మెయిల్ ద్వారా ఓటు వేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ముందస్తు ఓటింగ్ పెరిగింది. అయితే ఇదీ అభ్యర్థి విజయంపై ప్రభావం చూపిస్తోందనే అంచనాలు ఉన్నాయి.

Recommended Video

US Election 2020 : ట్రంప్ vs బిడెన్.. ఆ స్టేట్ లో ఎవరు గెలుస్తారో వారిదే అధ్యక్ష పదవి! || Oneindia
59 మిలియన్ ప్రజలు..

59 మిలియన్ ప్రజలు..


ఆదివారం వరకు 59 మిలియన్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని ప్లోరిడి వర్సిటీ నిర్వహిస్తోన్న ఇండిపెండెంట్ అమెరికా ఎలక్షన్ ప్రాజెక్ట్ అంచనా వేసింది. అయితే ఇదీ 2016లో 57 మిలియన్ల ప్రజలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఇదీ జో బిడెన్‌కు మేలు కలిస్తోందా అనే అంచనాలు ఉన్నాయి. అయితే మెయిల్ ఓట్ల ద్వారా తప్పు జరిగే అవకాశం ఉంది అని గత కొన్ని నెలలుగా ట్రంప్ చెబుతున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు చాలా మంది ఎన్నికల రోజే ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు.

ఎర్లీ ఓటింగ్ బెటర్..

ఎర్లీ ఓటింగ్ బెటర్..

ముందస్తు పోలింగ్ మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఓటు వేయొద్దని అనుకుంటే ఏం చేస్తారని ప్రొఫెసర్ మైఖేల్ మెక్ డొనాల్డ్ తెలిపారు. మరికొందరికీ పోలింగ్ కేంద్రం అందుబాటులో లేకుంటే.. ఎన్నికల కార్యాలయం మూసివేస్తే పరిస్థితి ఏంటీ అని అడిగారు. 2016లో 137 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. ఈ సారి 150 మిలియన్ అమెరికన్లు ఓటు వేసే అవకాశం ఉంది అని ఎలక్షన్ ప్రాజెక్టు పేర్కొన్నది.

టెక్సాస్‌లో భారీగా పెరిగిన ఓటింగ్

టెక్సాస్‌లో భారీగా పెరిగిన ఓటింగ్

ఈ సారి టెక్సాస్ రాష్ట్రంలో భారీగా ఓటు జరిగే అవకాశం ఉంది. 2016లోనే 80 శాతం ఓట్లు రాగా.. ఈ సారి అదీ పెరిగే ఛాన్స్ ఉంది. 1980 తర్వాత టెక్సాస్‌లో రిపబ్లికన్ అభ్యర్థుల పరిస్థితి మారుతూ వస్తోంది. ఇక్కడ ట్రంప్‌కు వ్యతిరేక గాలి వీస్తోందని కొన్ని పోల్స్ వెల్లడించాయి.

English summary
Early voting in the 2020 US election has surpassed all the pre-election ballots from four years earlier, an independent vote monitor said Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X