వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కుప్పకూలిన సైనిక విమానం: 9మంది మృతి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న సైనిక కార్గో విమానం కుప్పకూలింది. విమానం జార్జియాలో కుప్పకూలిందని, ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు ధ్రువీకరించారు.

కూలిపోయిన ప్యూర్టోరికో ఎయిర్‌ నేషనల్‌ గార్డ్‌ డబ్ల్యూసీ-130 విమానంలో ప్రమాదం సమయంలో 9మంది ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ లెక్కన ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లంతా మృత్యువాత పడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Nine killed when military plane crashes near Savannah

విమానం మెకానికల్ కండిషన్ సరిగానే ఉందని, ఎందుకు కూలిపోయిందనేది తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
విమానం మెయింటెనెన్స్‌ కోసం జార్జియాలోని డావిస్‌ మంతన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు వెళ్తుండగా సావన్నా విమానాశ్రయ సమీపంలోని రహదారిపై కూలిపోయిందని చెబుతున్నారు.

ఆపై భారీగా మంటలు ఎగిసిపడటంతో విమానం చాలావరకు దగ్ధమైంది. విమానంలో ఐదుగురు మాత్రమే ఉన్నారని తొలుత భావించినప్పటికీ.. మొత్తం 9మంది ఉన్నట్టు గుర్తించారు. కాగా, కూలిపోయిన విమానం 50ఏళ్ల పాతది అని ప్యూర్టోరికో నేషనల్ గార్డ్ ప్రతినిధి డాహ్లెన్ తెలిపారు. విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్విట్టర్ ద్వారా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

English summary
All nine people aboard an aging cargo plane making its final military flight Wednesday were killed when the aircraft nosedived into a Georgia highway
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X