వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడోస్సారి: నీరవ్ మోడీకి మళ్లీ బెయిల్ తిరస్కరించిన లండన్ కోర్టు

|
Google Oneindia TeluguNews

లండన్: ఒకసారి కాదు... రెండు సార్లు కాదు.. మూడోసారి కూడా ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ బెయిల్‌ను లండన్ కోర్టు తిరస్కరించింది. దీంతో నీరవ్ మోడీ మరిన్ని రోజులు అంటే మే 24 వరకు జైలు జీవితం గడపక తప్పదు.ఇదిలా ఉంటే మే 30వ తేదీనా నీరవ్ మోడీ కేసు పూర్తి స్థాయి విచారణకు రానుంది. ఆ రోజున వ్యక్తిగతంగా నీరవ్ మోడీ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈరోజు వీడియో ద్వారా నీరవ్ మోడీని విచారణ చేయడం జరిగింది.

వేలానికి నీరవ్ మోడీ విలాసవంతమైన కార్లు... ఎంతకు అమ్ముడుపోయాయంటే..? <br>వేలానికి నీరవ్ మోడీ విలాసవంతమైన కార్లు... ఎంతకు అమ్ముడుపోయాయంటే..?

నీరవ్ మోడీ తరపున వాదిస్తున్న న్యాయవాది కొత్త కారణాలుచూపక పోవడంతో జడ్జీ బెయిల్ తిరస్కరించినట్లు సమాచారం. జ్యుడిషియల్ కస్టడీ పొడగిస్తూ జడ్జీ ఆదేశాలు జారీ చేశారు.ఇక నీరవ్ మోడీని భారత్‌కు రప్పించే విషయంలో మరిన్ని అవసరం అయ్యే డాక్యుమెంట్లు సమర్పించాలని భారత అధికారులను వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఆదేశించింది. మార్చి 29న బెయిల్ మంజూరు కోసం జరిగిన వాదనలు విన్న కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మార్చి 19న నీరవ్ మోడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది.

Nirav Modi bail rejected for the third time, to stay in Jail

బ్యాంకుల వద్ద తీసుకున్న డబ్బు చెల్లించక పోవడంతో బ్యాంకులకు పెద్దఎత్తున్న నష్టం వాటిల్లిందని జడ్జి అభిప్రాయపడటంతో బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాదు ఈ కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేయాలని చూశారని కోర్టు భావించింది. ఇదిలా ఉంటే నీరవ్ మోడీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపున న్యాయవాది వాదించారు. యూఏఈ, సింగపూర్‌లలో శాశ్వత సభ్యత్వం నీరవ్ మోడీకి లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

English summary
In a major jolt to diamantaire Nirav Modi, the Westminster Magistrates' Court refused to grant him bail on Friday.India Today TV has learnt that Nirav Modi will remain in jail till May 24 while the full hearing in this case will take place on May 30 when Nirav Modi will be physically produced before the court. Today, Modi was produced via video link.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X