ఇంట్రెస్టింగ్: నీరవ్ మోడీ అరెస్టు కాగానే చెప్పిన కథ ఇదే... బెయిల్ తిరస్కరించిన కోర్టు
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసులో ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ లండన్‌లో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అరెస్టయిన మోడీ వెంటనే బెయిల్ కోసం మంజూరు చేసుకున్నాడు. అయితే బెయిల్‌ను తిరస్కరించింది లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ కోర్టు. దీంతో నీరవ్ మోడీ జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ పోలీసులు అదుపులో తీసుకోగానే నీరవ్ మోడీ ఏం చెప్పాడు... ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశాడు..?
కాంగ్రెస్ తరపున నేను క్షమాపణ కోరుతున్నా: ఆ ఉద్యోగులతో మోడీ

మెట్రో స్టేషన్లో పోలీసులకు చిక్కిన నీరవ్ మోడీ
నీరవ్ మోడీ... వజ్రాల వ్యాపారి. భారత్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోపీ పెట్టి విదేశాలకు పలాయనం చిత్తగించిన ఆర్థిక నేరగాడు. కొద్ది రోజుల క్రితం నీరవ్ మోడీ లండన్ వీధుల్లో తిరుగుతూ ఉండగా అంతర్జాతీయ మీడియా కంటికి చిక్కాడు. ఇక అక్కడ నుంచి నీరవ్ మోడీపై వేట కొనసాగింది. నీరవ్ మోడీని అరెస్టు చేయాల్సిందిగా ఈడీ లండన్ కోర్టును అభ్యర్థించింది. దీంతో కోర్టు ఆదేశాలు అందుకున్న అధికారులు నీరవ్ మోడీ కోసం గాలించి ఓ మెట్రో స్టేషన్లో పట్టుకున్నారు.

నేను ఇక్కడ ఒక ఉద్యోగిని... నెలకు 18లక్షలు నాజీతం
పోలీసులకు ఈ ఆర్థిక నేరగాడు దొరకగానే వారు లండన్ వెస్ట్మిన్స్టర్ కోర్టులో హాజరుపర్చారు. ఏదో కథ అల్లి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ముందుగా తాను ఒక ఉద్యోగినని ఓ కంపెనీలో నెలకు 20వేల పౌండ్ల జీతానికి పనిచేస్తున్నట్లు చెప్పాడు. అంటే మన కరెన్సీలో రూ.18 లక్షలు. దీన్ని ధృవీకరిస్తూ తన పే స్లిప్ కూడా కోర్టుకు చూపించాడు. దీంతో పాటు తాను ట్యాక్స్ కడుతున్నట్లుగా కూడా నేషనల్ ఇన్ష్యూరెన్స్ నెంబర్లను రుజువుగా చూపించాడు. మోడీ అరెస్టు అయ్యాడన్న సంగతి తెలుసుకుని వెంటనే బెయిల్ కోసం కూడా చకచకా ప్రయత్నాలు జరిగాయి. అయితే తాను చేసిన మోసం సాధారణంగా లేదని పెద్ద మొత్తంలో డబ్బులను ఎగ్గొట్టాడని చెప్పిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు. అంతేకాదు కోర్టుకు హాజరుకాకుండా లండన్ విడిచి పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయస్థానం భావించింది. అందుకే బెయిల్ మంజూరుకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది.

నీరవ్ కేసును కూడా టేకప్ చేసింది మాల్యా కేసును వాదించిన లాయరే
ఇదిలా ఉంటే తనపై కుట్ర చేస్తున్నారని కోర్టులో మొరపెట్టుకున్నాడు నీరవ్ మోడీ. తనపై కేసులు రాజకీయ కోణంలో పెట్టడం జరిగిందని చెప్పాడు. అయితే ఎంత చెప్పినప్పటికీ తన వాదనను న్యాయస్థానం పట్టించుకోలేదు. మార్చి 29న కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుందని కోర్టు కేసును వాయిదా వేసింది. ఇక అప్పటి వరకు నీరవ్ మోడీ జైలు జీవితం గడపనున్నారు. మరోవైపు నీరవ్ మోడీ భార్యపై కూడా అరెస్టు వారెంటు జారీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే విజయ్ మాల్యా అరెస్టు అయిన సమయంలో తనకు బెయిల్ మంజూరు విషయంలో వాదించిన న్యాయవాది
ఆనంద్ దూబేనే నీరవ్ మోడీ కేసులో కూడా బెయిల్ కోసం వాదించినట్లు సమాచారం.