వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్యారిస్ నగరాన్ని వణికిన భారీ శబ్ధం: ‘పేలుడేనా?’.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఒక్కసారిగా ఓ భారీ శబ్దంతో ఉలిక్కిపడింది. దీంతో భారీ పేలుడు ఏదైనా జరిగి ఉంటుందా? అని ప్యారిస్ నగర ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు.

అయితే, ప్యారిస్ పోలీసులు ఈ శబ్ధానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారీ పేలుడు లాంటి ఘటన ఏమీ జరగలేదని చెప్పారు. ఓ యుద్ధ విమానం సౌండ్ బారియర్స్ ను దాటుకుని వెళ్లడం వల్లేనని స్పష్టం చేసింది.

No blast in Paris, loud sound was due to fighter plane breaking sound barrier: Police

'ప్యారిస్ పరిసర ప్రాంతాల్లో ఓ పెద్ద శబ్ధం వినిపించింది. అది ఎలాంటి పేలుడుకు సంబంధించినది కాదు. ఓ యుద్ధ విమానం సౌండ్ బారియర్స్ దాటుకుని వెళ్లింది. అందుకే ఆ శబ్ధాలు వచ్చాయి' అని ప్యారిస్ పోలీసులు ప్రజలకు స్పష్టం చేశారు.

ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులకు ఫోన్ చేయొద్దని తెలిపారు. కాగా, కొందరు టెన్నిస్ మైదానంలో ఆట ఆడుతుండగా పేలుడు శబ్ధం వినిపించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇది ఇలావుంటే, గత మే నెలలో కర్ణాటకలోని బెంగళూరులో కూడా ఇదే తరహా భారీ శబ్ధాలు వినిపించిన విషయం తెలిసిందే. అందరూ భూకంపం అనుకుని భయపడ్డారు. ఆ తర్వాత యుద్ధ విమానాల వల్లే శబ్ధం వచ్చిందని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది.

English summary
Aloud sound resembling a major blast that was heard across Paris and its adjoining suburbs was actually caused due to a plane breaking the sound barrier, police in Paris have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X