వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లోకి వద్దు, అప్పటి వరకు భారత్‌తో మాటల్లేవ్: ఇమ్రాన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అయినప్పటికీ పాకిస్థాన్ మాత్రం కుక్క తోక వంకరే అన్నట్లు వ్యవహరిస్తోంది. కాశ్మీర్‌లో విధించిన ఆంక్షలు తొలగించే వరకు భారత్‌లో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాటి నుంచి భారతదేశంపై పాకిస్థాన్ అక్కసు వెల్లగక్కుతూనే ఉంది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చి అబాసుపాలు కూడా అవుతూనే ఉంది. అటు ఐక్యరాజ్యసమితి గానీ.. ఇటు ప్రపంచ దేశాలు గానీ పాక్‌‌కి మద్దతుగా నిలవకపోయినా... ఆ దేశం మాత్రం మొసలికన్నీరు కారుస్తూనే ఉంది.

 No chance of bilateral talks with India on Kashmir until curfew is lifted: Imran Khan

కాశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత భారత్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని, అప్పటి వరకు ఎలాంటి చర్చలూ ఉండవని ఇమ్రాన్ ఖాన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

పాకిస్థానీయులు ఎవరూ కూడా కాశ్మీర్‌లో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వెల్లకూడదని, అది ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, ఓ వైపు ఉగ్రవాదులను సరిహద్దుల్లోకి పంపుతూనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా, మన సరిహద్దులోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత దళాలు వెనక్కి పంపని విషయం తెలిసిందే.

English summary
Pakistan Prime Minister Imran Khan on Wednesday said his government will not hold any bilateral talks with India unless curfew and restrictions are lifted in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X