వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ ఆరోగ్యంపై ట్రంప్ ప్రకటన...ఆ రోజు నుంచి నియంత అదృశ్యం..సౌత్ కొరియా వాదన మరోలా..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : ప్రస్తుతం ప్రపంచంలో రెండే హాట్‌ టాపిక్స్‌గా మారాయి. ఒకటి కరోనావైరస్ రెండు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి. కరోనావైరస్ ఎలాగూ ప్రతిరోజూ చర్చించుకుంటున్న విషయమే కాబట్టి నెటిజెన్లు ఎక్కువగా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య సమాచారం కనుగొనేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ మంగళవారం మీడియా కోడై కూసింది. ఆ తర్వాత కిమ్ వారసురాలంటూ తన సోదరి సైతం తెరపైకి వచ్చింది. నిన్న రోజు గడిచేకొద్దీ కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారంటూ స్వయంగా శతృదేశమైన దక్షిణ కొరియా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయినప్పటికీ చాలామందికి ఏదో మూలాన కిమ్ ఆరోగ్యంపై డౌట్‌గానే ఉంది. తాజాగా అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే అంశంపై స్పందించారు.

Recommended Video

Donald Trump Surprising Words on North Korean Leader Kim Jong Un
 ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు

ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు

"ప్రపంచదేశాలకు మీరు అగ్రరాజ్యం కావొచ్చు.. కానీ నా ముందు మాత్రం మీరు వెంట్రుకతో సమానమే" అంటూ భూమికి జానెడు ఎత్తు లేని ఉత్తరకొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జాంగ్ ఉన్ అమెరికాకు సవాల్ విసిరాడు. ఆదేశాన్ని అణుపరీక్షలతో బెదరగొట్టాడు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ మెట్టు దిగొచ్చి కిమ్‌తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఆ చర్చలు ఫలితం ఇవ్వనప్పటికీ ఈ చర్చలు భవిష్యత్తుకు భరోసా ఇచ్చాయనే చెప్పొచ్చు. తాజాగా కిమ్ ఆరోగ్య పరిస్థితి పై సమాచారం ఏంటని వైట్‌హౌజ్‌లో ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది. కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదని చెప్పారు. తమ అధికారులు కిమ్ జాంగ్ ఉన్ పరిస్థితి విషమంగా ఉందని చెబుతుండగా దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం కిమ్ బాగానే ఉన్నారనే ప్రకటన చేసిందని దీంతో స్పష్టమైన సమాచారం లేదని ట్రంప్ చెప్పారు.

 అమెరికా నివేదిక ఒకలా.. దక్షిణ కొరియా రిపోర్ట్ మరోలా

అమెరికా నివేదిక ఒకలా.. దక్షిణ కొరియా రిపోర్ట్ మరోలా

ఒకవేళ నిజంగానే కిమ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోతే తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. గుండెసంబంధిత సర్జరీ అయ్యాక కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని అమెరికా అధికారులు నివేదిక ఇచ్చారు. ఇదిలా ఉంటే దక్షిణ కొరియా మాత్రం మరో రిపోర్టును విడుదల చేసింది. కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంగానే ఉన్నారని... అతను ఉత్తరకొరియా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తన తాత జయంతి ఉత్సవాల్లో కిమ్ పాల్గొనకపోవడంతో ప్రపంచానికి అనుమానాలు రేకెత్తాయి. అంతేకాదు తాను ఎందుకు పాల్గొనలేకపోయారో అన్న దానిపై ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియా కూడా ఒక ప్రకటన చేయలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

 తాత జయంతి ఉత్సవాలకు ఎందుకు గైర్హాజరయ్యారు..?

తాత జయంతి ఉత్సవాలకు ఎందుకు గైర్హాజరయ్యారు..?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చైన్ స్మోకర్ అన్న విషయం అందరికీ తెలుసు. అంతేకాదు చిన్న వయసులోనే అధిక బరువు ఉండటం కూడా ఆయన ఆరోగ్యంను దెబ్బ తీసి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఏప్రిల్ 15న ఉత్తరకొరియాలో పెద్ద పండగలా నిర్వహిస్తారు. ఆరోజు తన తాత కిమ్ సాంగ్ జయంతి. ఏటా చాలా గ్రాండ్‌గా ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇక అప్పటి నుంచి కిమ్ కనిపించడం లేదు. ఇక నార్త్ కొరియాలో పరిస్థితిని నిత్యం పర్యవేక్షించే నిపుణులు కూడా ఆ దేశాధ్యక్షుడి కదలికల గురించి అంచనా వేయలేకున్నారు. అయితే ఆ దేశంలోని కొందరు ఇన్‌ఫార్మర్లు దక్షిణ కొరియాలోని వార్తా వెబ్‌సైట్ ది డైలీ నార్త్ కొరియాకు సమాచారం ఇచ్చారు. కిమ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ సమాచారం ఇచ్చారు.

 ఏప్రిల్ 11న చివరిసారి ప్రత్యక్ష్యమైన కిమ్

ఏప్రిల్ 11న చివరిసారి ప్రత్యక్ష్యమైన కిమ్

ఇదిలా ఉంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏప్రిల్ 11న పొలిట్ బ్యూరో సమావేశాలకు హాజరైనట్లు ఆదేశ మీడియా పేర్కొంది. ఆ తర్వాత మిలటరీ యూనిట్‌ను సమీక్షించారని చెప్పిన మీడియా ఏ తేదీలో ఈ సమీక్ష నిర్వహించారనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియాలో కిమ్ గురించి ప్రస్తావనే లేదు. ఈ ఏడాది కిమ్ జాంగ్ ఉన్ ఇప్పటి వరకు 17 సార్లు పబ్లిక్‌లో కనిపించినట్లు మీడియా పేర్కొంది.

English summary
U.S. President Donald Trump said he doesn’t know about Kim Jong Un’s health after American and South Korean officials gave differing accounts on the North Korean leader’s condition after he was conspicuously absent from a major celebration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X