వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. వెంటనే ఆ ప్రచారం ఆపేయండి: భారత్‌కు చైనా హెచ్చరిక!

రాజీ దిశగా చైనా ఆలోచిస్తుందన్న ప్రచారం వట్టిదేనని ఆ దేశ అంతర్జాతీయ సంబంధాల పరిశోధకుడు హు జియాంగ్ స్పష్టం చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్-చైనా డోక్లామ్ సరిహద్దు వివాదం రగులుతూనే ఉంది. ఈ విషయంలో రాజీ దిశగా చైనా ఆలోచిస్తుందన్న ప్రచారం వట్టిదేనని ఆ దేశ అంతర్జాతీయ సంబంధాల పరిశోధకుడు హు జియాంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

డోక్లామ్ విషయంలో తమ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకునేది లేదని, తమ భూభాగం నుంచి తమ సైన్యాన్నే వెనక్కి ఎలా తీసుకుంటామని ప్రశ్నించింది. ఈ సందర్భంగా హు జియాంగ్ భారత్ తో చర్చల గురించి ప్రస్తావించారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లినంత మాత్రానా.. చైనా రాజీకి వస్తుందనుకోవడం సరికాదని అన్నారు.

డోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినాడోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా

No 'Compromise' With Ajit Doval on Border Standoff, Says Chinese Media

ఈ అంశాన్ని ఉటంకిస్తూ చైనా రాజీ ధోరణి అంటూ భారత మీడియా ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికైనా ఊహాగానాలకు తెరదించాలని సూచించారు. 'చైనా నిర్ణయం మారదు.. భారత ప్రభుత్వం, అక్కడి మీడియా మేం రాజీపడుతున్నట్లుగా ఊహాగానాలు కల్పించడం సరికాదు' అని స్పష్టం చేశారు.

English summary
There will be no “compromise” on the Doklam standoff with India’s National Security Advisor Ajit Doval who is in Beijing for a BRICS Summit, state-controlled Chinese media has quoted experts as saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X