వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

no coronavirus in Palau: 18 వేల జనాభా ఉన్న ద్వీపంలో అద్భుతం, ఒక్క పాజిటివ్ కూడా...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. చైనాలోని వుహాన్‌లో గతేడాది డిసెంబర్‌లో ఆవిర్భవించిన వైరస్.. ప్రపంచ నలుమూలాల్లోకి పాకింది. 190 దేశాల్లో వైరస్ బారిన పడ్డ ప్రజలు బిక్కు బిక్కుమంటున్నాయి. కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోగా.. మరికొన్ని దేశాలు వైరస్‌తో పోరాడుతున్నాయి. కరోనా పేరు చెబితే చాలు వణికిపోయే పరిస్థితి. కానీ ఆ దేశంలో మాత్రం కరోనా వైరస్ ఎవరికీ సోకలేదు.

నో వైరస్..

నో వైరస్..

ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 5 లక్షల పైచిలుకు కాగా.. 35 వేలకు పైగా చనిపోయారు. ఉత్తర పసిఫిక్‌లో గల పలావు ద్వీపం ప్రజలకు కరోనా వైరస్ అంటే ఏంటో తెలియదు. ఇక్కడ కేవలం 18 వేల మంది జనాభా ఉన్న.. ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం శుభ పరిణామం. పలావు ద్వీపం కావడంతో.. టోంగా, సోలమన్, మార్షలు, మైక్రోనేషియా నుంచి వచ్చేవారికి కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో పలావులోకి రావడం కష్టంగా మారడంతో.. కరోనా వైరస్ ప్రబలలేదు.

కఠిన చర్యలు..

కఠిన చర్యలు..

పలావు ద్వీపానికి సమీపంలో అంటార్కిటికాలో సమోవా, తుర్కెనిస్థాన్, ఉత్తర కొరియా ఉన్నప్పటికీ.. ఆ దేశం తీసుకున్న చర్యలు కలిసి వచ్చాయి. కానీ పలావుకు ఉత్తరంగా ఉన్న మరియానా దీవుల్లో కరోనా అనుమానిత కేసు నమోదైంది. ఇక్కడ సోమవారం ఒకరు చనిపోయారని కూడా అధికారులు పేర్కొన్నారు. పక్కన గల దీవుల్లో వైరస్ ప్రబలడంతో జనాలు ఆందోళనకు గురయ్యారు. లాక్ డౌన్ విధిస్తారేమోననే భయంతో షాపింగ్ మాల్స్‌కు పరుగులు తీశారు. సాధారణంగా ఇక్కడ వీకెండ్‌లలో రద్దీ ఉంటుంది. కానీ వైరస్ ప్రభావంతో వారం రోజుల్లో కూడా రద్దీ నెలకొంది.

మంచి వనరులు..

మంచి వనరులు..

పలావులో మంచి వనరులు ఉండగా.. ఉత్తమ సేవలు అందిస్తున్నారు. అందుకోసమే వుహాన్, న్యూయార్క్, మాడ్రిడ్ మాదిరిగా మారలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే వైరస్ నేపథ్యంలో భయాందోళన కూడా ఉందని.. ఒకరిని నిర్బంధంలో కూడా ఉంచారని స్థానికులు చెబుతున్నారు. నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు పలావులోని అతి పెద్ద పట్టణం కోరోర్‌ సూపర్ మార్కె‌ట్‌లో శానిటైజర్లు, మాస్క్, లిక్కర్ కొరత ఏర్పడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
nestled in the northern Pacific in Palau island. It has a population of 18,000, but has still not reported a single Covid-19 positive case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X