వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ కన్నా పోలీసులే ఎక్కువ ప్రాణంతకంగా మారిన దేశం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఉగాండా సైనికులు

ఉగాండాలో కరోనావైరస్ సోకి ఇప్పటివరకూ ఎవరూ చనిపోయిన దాఖలాలు లేవు. కానీ, భద్రతా సిబ్బంది చేతుల్లో 12 మంది చనిపోయారు. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేదని వీరిపై దాడి చేశారు. బీబీసీ ప్రతినిధి పేషెన్స్ అతుహైర్ మృతుల కుటుంబాలను కలిసి మాట్లాడారు.

30 యేళ్ల ఎరిక్ ముటాసిగాను కాలిపై కాల్చారు. మూడు వారాల తరువాత జూన్ నెల‌లో ములాగో హాస్పటిల్‌లో చికిత్స పొందుతూ ఎరిక్ మరణించారు.

"మన నుంచి దూరంగా వెళిపోతున్న వ్యక్తిని ఎవరైనా షూట్ చేస్తారా? పోయిన మనిషిని ఎలాగో తిరిగి తీసుకురాలేరు కనీసం చేసినదానికి క్షమాపణలైనా అడగాలి కదా! ఇప్పుడు ఈ పిల్లలతో నా బాధలేవో నేనే పడాలి" అంటూ ఎరిక్ తల్లి 65 యేళ్ల జాయిస్ నముగలు ముటాసిగా నిట్టూర్చారు..

8మంది సభ్యులున్న ఆ కుటుంబానికి ఇప్పుడు ఆమే ఆధారం. ఆమె మనవళ్లు చాలా చిన్నవాళ్లు. 3, 5 యేళ్ల వాళ్లు. జరిగినదేంటో తెలుసుకునే వయసు కాదు. అక్కడే తిరుగుతూ "నాన్న కారుకు ఫొటో తీసుకుందాం" అంటూ ఆడుకుంటున్నారు. ఎరిక్ ముటాసిగా ఒక స్కూల్లో హెడ్‌ టీచరుగా పనిచేసేవారు.

పోలీసులు, సైనికులు, స్థానిక సాయుధ పౌర దళం లోకల్ డిఫెన్స్ యూనిట్(ఎల్‌డీయూ) సభ్యులు ఈ హింసలకు పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా మార్చ్ నుంచీ అక్కడ కర్ఫ్యూ పాటిస్తున్నారు. సూర్యాస్తమయం నుంచీ సుర్యోదయం వరకూ లాక్‌డౌన్ విధించారు. పోలీసులు, సైనికులు, ఎల్‌డీయూ సభ్యులు కలిసి రోడ్స్ బ్లాక్ చేస్తూ లాక్‌డౌన్ సమయంలో ప్రజలు బయటకి రాకుండా పర్యవేక్షిస్తున్నారు. బొడ బొడాస్ అని పిలిచే మోటర్‌ సైకిల్ టాక్సీలకు కూడా అనుమతించట్లేదు.

ఎరిక్ ముటాసిగా తల్లి జాయ్స్ నముగాలు ముటాసిగా

'నేనేంచెయ్యాలోనువ్వునాకుచెప్పక్కర్లేదు’

మే 13న పోలీసులు, ఏల్‌డీయూ సభ్యులు ఎరిక్ ముటాసిగా ఇంటికి వెళ్లారు.

ముటాసిగా రాజధాని కంపాలాలోని ముకోనోలో మెర్రీటైమ్ అనే ప్రాథమిక పాఠశాల నడుపుతూ, ఇంటి పక్కనే ఒక చిన్న దుకాణాన్ని కూడా నడుపుతున్నారు.

ఆ బుధవారంనాడు లాక్‌డౌన్ నియమాలకు వ్యతిరేకంగా సాయంత్రం 7 వరకూ దుకాణాలు తెరిచి ఉంచినవారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ముటాసిగా ఇంటిపక్కనే ఉన్న తన దుకాణం ముందు చపాతీలు చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

"అతన్ని విడిచిపెట్టమని నేను ఎంతగానో బతిమాలాను. అతన్ని వదాలాలా వద్దా అని వాళ్లల్లో వాళ్లే చర్చించుకుంటూ ఉన్నారు" అని ముటాసిగా ఒక స్థానిక జర్నలిస్ట్‌కు చెప్పారు.

ఈలోగా అక్కడ జనం గుమికూడారు. వాదోపవాదాలు జరిగాయి.

"నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నేను కావాలంటే నిన్ను షూట్ చెయ్యగలను అని నాతో అన్నారు."

"నేను వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే తుపాకీని గాల్లో కాల్చిన శబ్దం వినబడింది. వెనక్కి తిరిగి చూశాను. తుపాకీ నావైపు గురిపెట్టి ఉంది. నా ఎడమ కాలిలోకి తుపాకీగుండు దూసుకుపోయింది. నేను కింద పడిపోయాను. వెంటనే వాళ్లు తమ మోటార్ ‌సైకిల్ ఎక్కి పారిపోయారు" అని ముటాసిగా ఆ స్థానిక జర్నలిస్ట్‌కు సంఘటన వివరాలు తెలిపారు.

అతను గాయాల నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వస్తాడని కుటుంబ సభ్యులు ఎదురుచూశారు.

"సర్జరీ చేస్తారేమోనని మేము హాస్పటిల్‌లోనే వేచి చూసే వాళ్లం. వాళ్లను అడిగినప్పుడల్లా, గాయం చాలా పెద్దది, దానికి చికిత్స చెయ్యడం సాధ్యపడట్లేదు అని చెప్పేవారు. చివరికి జూన్ 8 న ఆపరేషన్ చేస్తామని థియేటర్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ నా బిడ్డ ప్రాణాలు విడిచాడు" అని ముటాసిగా తల్లి చెప్పారు.

తుపాకీగుండు తగిలి అతను మరణించినట్టు మరణ ధ్రువీకరణ పత్రంలో రాశారు.

"కొంతమంది శ్రేయోభిలషులు కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చారు. కానీ నా బిడ్డను కాల్చిన వ్యక్తి వివరాలు పోలీసులు బయటపెట్టలేదు. ఎవరి మీద కేసు పెడతాం!" అని ముటాసిగా తల్లి అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేమని ఆమె భావిస్తున్నారు.

{image-_113488158_eric'smother.jpg telugu.oneindia.com}

మరో కథ

ఫరీదా నాన్యోంజో ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

తన సోదరుడు రాబర్ట్ సెన్యోంగా పోలీసుల దాడిలో మరణించారు.

జూలై 7 న ఫరీదాకు ఒక ఫోన్‌ కాల్ వచ్చింది. మోటార్ సైకిల్ నడిపినందుకుగానూ తన సోదరుడిని తుపాకీ వెనక భాగంతో తీవ్రంగా కొడుతున్నారని, కొడుతున్న వ్యక్తి ఎల్‌డీయు సభ్యులు కావొచ్చని చెప్పారు.

20 యేళ్ల సెన్యోంగా తలకు బాగా దెబ్బలు తగిలాయి. అనేకచోట్ల ఫ్రాక్చర్లయ్యాయి. ఆరాత్రే అతన్ని కంపాలాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లు ములాగో ఆస్పత్రికి తీసుకెళ్లమని సలహా ఇచారు. అక్కడికి వెళితే బెడ్స్ ఖాళీగా లేవన్నారు. చివరికి ఎలాగోలా అడ్మిట్ చేసుకున్నారు. మరో రెండు మూడు రోజుల్లో సర్జరీ చేస్తామని అన్నారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది అని నాన్యోంజో వివరించారు.

"నా తోడబుట్టినవాడు నా చేతుల్లోనే చనిపోయాడు. తనని బాగా కొట్టారు. అంత పెద్ద ఆస్పత్రిలోకూడా నా సోదరుడికి సరైన వైద్యం అందించలేకపోయారు" అని నాన్యోంజో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎల్‌డీయూ దళం

ఎల్‌డీయూను 2000లో స్థాపించినప్పుడు చాలా అపఖ్యాతిని పొందింది. ఈ దళ సభ్యులు చట్టవిరుద్ధమైన హత్యలు చేస్తున్నట్టు, కిరాయి హంతకులుగా మారినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎల్‌డీయూ దళాన్ని రద్దు చేశారు. 2018లో తిరిగి ప్రారంభించాక ఉగాండా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

చిన్న పిల్లలకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకుండా దళంలోకి చేర్చుకుంటున్నారని, వారికి ఉద్రిక్తతలను ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదని విమర్శకులు అంటున్నారు.

ప్రస్తుత సంఘటనల తరువాత ఆర్మీ అప్రమత్తమయ్యింది. ఎల్‌డీయూ సభ్యులకు మళ్లీ పూర్తి ట్రైనింగ్ ఇచ్చిన తరువాతే భద్రతకు సంబంధించిన బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.

ఆ దేశాధ్యక్షుడు యోవేరి ముసెవెని, ఇతర ఉన్నతాధికారులు ఈ దాడులను ఖండించారు. కానీ బీబీసీ అక్కడి భద్రతా సంస్థలను సంప్రదించినప్పుడు ఈ సంఘటనల గురించి బహిరంగ ప్రకటన ఇవ్వడనికి ఎవ్వరూ ముందుకు రాలేదు.

ఉగాండా సైనిక శిక్షణ

సైనికుడి అరెస్ట్

అలెన్ ముసీమెంటా భర్తను చంపిన కారణంగా ఒక సైనికుడికి 35 యేళ్ల కారాగార శిక్ష విధించారు.

"ఆ సైనికుడికి శిక్ష పడడం ఆనందమే కానీ నా భర్త తిరిగి రాడు కదా" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జూన్ 24 న బెనన్ ఎన్సిమెంటాను కాల్చి చంపేశారు. ఈ నవంబర్‌లో బెనెన్ చర్చ్ ప్రీస్ట్‌గా పదోన్నతి పొందవలసి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది.

బెనన్ తన భార్యతో కలిసి సొంత వాహనంలో తన స్వగ్రామానికి బయలుదేరారు. అది అద్దెకు తీసుకున్న వాహనం కాదని, సొంత వాహనమని స్థానిక అధికారుల దగ్గర సర్టిఫికెట్ తీసుకున్నారు.

"సైనికులు మా వాహనాన్ని మధ్యలో ఆపారు. ఒక్క ప్రశ్న కూడా అడగకుండా, రోడ్డు దాటి వచ్చి, నా భర్త మెడపై గురిపెట్టి కాల్చేశారు" అని ముసీమెంటా చెప్పారు.

“నా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎన్నో ప్లాన్ చేసుకున్నాం. అవన్నీ నేనొక్కర్తినే ఎలా చెయ్యగలను” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఫుట్‌బాల్ కోచ్ నెల్లీ జూలియస్ కలేమా

మరో ఉదంతం

ఫుట్‌బాల్ కోచ్ నెల్లీ జూలియస్ కలేమా ప్రాణాలు కాపాడుకోగలిగారుకానీ పోలీసుల చేతిలో చావు దెబ్బ తిన్నారు.

అది కర్ఫ్యూ సమయం. కలేమా తన స్నేహితురాలు ఎస్తర్‌కు ఆరోగ్యం బాలేదని మోటార్‌ సైకిల్ మీద ఆస్పత్రికి తీసుకుని వెళుతుండగా కొందరు పోలీసులు మోటార్‌ సైకిల్ మీద వచ్చి వాళ్లని బండి ఆపమన్నారు. కొంచెం ముందుకెళ్లి సురక్షిత స్థలంలో అపుతానని కలేమా చెప్పారు. వెంటనే పోలీసుల్లో ఒకరు లాఠీ తీసుకుని ఎస్తర్ మెడ మీద బలంగా గుద్దారు. ఆమె తూలి కిందపడిపోయారు. కలేమా బండి అదుపు తప్పి పక్కనే ఉన్న కాంక్రీటు బెంచీని గుద్దుకున్నారు. పెద్ద పెద్ద కుట్లు పడ్డాయి. ఎస్తర్ కాలు విరిగింది.

"మేము ప్రాణాలతో బయటపడ్డాం కానీ పోలీసుల దౌర్జన్యాలు ఎప్పుడు అంతమవుతాయో అర్థం కావట్లేదు" అని కలేమా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
No deaths due to Covid-19 in Uganda,but 12 killed by police for not taking Covid-19 precautions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X