వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలంటే ఇష్టం లేదు, నా భార్య కూడ వద్దంది: రఘురామ్ రాజన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యం తనకు లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రఘురామ్ రాజన్ ‌కు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో రఘురామ్ రాజన్ ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.

రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతల నుండి తప్పుకొన్న తర్వా ప్రోఫెసర్‌గా పనిచేస్తున్నారు. అయితే రాజకీయాల్లో చేరేందుుకు రఘురామ్ రాజన్ ఆసక్తి కనబరుస్తున్నారనే ప్రచారం కూడ ఇటీవల కాలంలో సాగుతోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ రఘురామ్ రాజన్‌కు రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందని కూడ ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై ఎట్టకేలకు రఘురామ్ రాజన్ స్పష్టత ఇచ్చేశారు.

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం తనకు లేదని ఆర్భీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టత ఇచ్చారు.ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నప్పుడు.. ప్రజలు నేను అకాడమీవైపు వెళ్లాలనుకున్నారు. ఇప్పుడు నేను ప్రొఫెసర్‌గా ఉంటే.. ఇంకెక్కడికో వెళ్లాలని అనుకుంటున్నారు. ప్రొఫెసర్‌గా నేను చాలా ఆనందంగా ఉన్నాను. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని రఘురామ్ రాజన్ స్పష్టత ఇచ్చారు.

నా భార్య కూడ వద్దని చెప్పారు

నా భార్య కూడ వద్దని చెప్పారు

నా భార్య కూడా రాజకీయాల్లోకి రావద్దని స్పష్టంగా చెప్పేసిందని రఘురామ్ రాజన్‌ చెప్పారు.రఘురామ్ రాజన్ రాజకీయాల్లోకి రావడమనే విషయమై ఇటీవల కాలంలో తీవ్ర చర్చ సాగుతోంది. అయితే రఘురామ్ రాజన్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరుతారనేది కూడ ఆసక్తి నెలకొని ఉండేది.రఘురామ్ రాజన్‌‌కు ఆప్ ఎంపీ సీటును ఆఫర్ చేసినట్టుగా కూడ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఉద్యోగ రిజర్వేషన్లు దేశ ప్రగతికి నష్టం

ఉద్యోగ రిజర్వేషన్లు దేశ ప్రగతికి నష్టం

స్వల్పకాలిక రాజకీయ పరిష్కారమైన ఉద్యోగ రిజర్వేషన్లు దేశ వ్యవస్థకు నష్టం కలిగిస్తాయని రాజన్‌ అభిప్రాయపడ్డారు. వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్త ఉద్యోగాల సృష్టితోనే అభివృద్ది

కొత్త ఉద్యోగాల సృష్టితోనే అభివృద్ది

రిజర్వేషన్ల పేరుతో ఉద్యోగాల్లో వివక్ష ప్రస్తుతం పెద్ద సమస్యగా మారుతోందని రఘురామన్ రాజన్ అభిప్రాయపడ్డారు. భారత్‌లోనూ ఈ సమస్య ఉందని చెప్పారు. ఆర్థిక ప్రగతికి ఇది చాలా నష్టదాయకమని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.కొత్త ఉద్యోగాలను సృష్టించడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.

English summary
Ruling out any possibility of entering politics, former RBI Governor Raghuram Rajan today said he is happy being a professor and it's the job he likes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X