వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో పాస్ పోర్ట్..నో డాక్యుమెంట్స్ : విదేశాలకు వెళ్లేందుకు కొత్త టెక్నాలజీ వస్తుందోచ్..!

|
Google Oneindia TeluguNews

విమానంలో విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాల్సిందే. అయితే భవిష్యత్తులో పాస్‌పోర్టు లేకుండానే ప్రయాణించొచ్చట. ఇందుకోసం ప్రణాళికలు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మరి పాస్‌పోర్టు లేకుండా ఎలా వెళ్లొచ్చు..?

నోన్ ట్రావెలర్ డిజిటల్ ఐడెంటిటీ (KTDI)ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు పాస్‌పోర్టులు లేకుండా విమానాల్లో విదేశాలకు వెళ్లొచ్చట. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీము పనులు జరుగుతున్నాయి. ముందుగా కెనడా నుంచి నెదర్లాండ్స్‌కు పాస్‌పోర్టు లేకుండా ప్రయాణికులను పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయాణికుల దగ్గర ఒక మొబైల్ ఫోను ఉంటే చాలని చెబుతోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలోనే విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిపోతోంది. అందుకే KTDI పద్ధతి ద్వారా అక్రమమార్గాల్లో విదేశాలకు వెళ్లే వారికి చెక్ పెట్టాలని భావిస్తోంది.

No Passports in future,Air travel to become easy soon

2030 నాటికి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారి సంఖ్య 1.8 బిలియన్‌కు చేరుకోనుందని, వీరందరినీ చెక్ చేసి పంపించడం కష్టతరం అయిపోతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి క్రిస్టోఫ్ వుల్ఫ్ చెబుతున్నారు. ఇందుకోసమే KTDI టెక్నాలజీని వినియోగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ సేవలు అనుకున్న ఫలితాన్ని ఇస్తే ఇక భవిష్యత్తులో పాస్‌పోర్టు ఇతర పేపర్ వర్క్ అవసరం ఉండదని చెబుతున్నారు. 2019 సంవత్సరమంతా ఈ ప్రయోగాలు కొనసాగుతాయని 2020లో తొలిసారిగా డిజిటల్ డాక్యుమెంట్లతో తొలి ప్రయాణం జరుగుతుంది. ఈ స్కీమ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆయా దేశ ప్రభుత్వాలపై ఏవియేషన్ సంస్థలపై ఆధారపడి ఉంటుంది.

English summary
The future of air travel is… paperless. Or will be, under an initiative introduced by the World Economic Forum.The Known Traveller Digital Identity (KTDI) programme will allow people to fly document-free between international destinations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X