వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పా'పి'స్తాన్: కుల్‌భూషణ్‌కు మళ్లీ కాన్సులర్ యాక్సెస్ ఇవ్వలేమన్న పాకిస్తాన్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాక్ జైలులో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో మరోసారి పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలకు పోయింది. ఇప్పటికే ఒకసారి కుల్‌భూషణ్ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇచ్చిన పాకిస్తాన్, ఇక రెండోసారి కాన్సులర్ యాక్సెస్ ఇచ్చేది లేదంటే తెగేసి చెప్పేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ ఓ ప్రకటన చేశారు.

అంతర్జాతీయ న్యాయస్థానం కుల్‌భూషణ్ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని తీర్పునివ్వడంతో సెప్టెంబర్ 2వ తేదీన తొలిసారిగా కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్ కలిశారు. అంతకుముందు నిబంధనలు షరతులపై ఇరుదేశాల మధ్య చర్చలు జరగడంతో కాన్సులర్ యాక్సెస్‌ ఇవ్వడంలో జాప్యం జరిగింది. వియన్నా కన్వెన్షన్ ప్రకారం కుల్‌భూషణ్ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాల్సిందే అని అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్‌ను ఆదేశించడంతో పాక్ అవకాశం కల్పించింది. అయితే ఎన్నిసార్లు ఇవ్వాలి అనేదానిపై న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేయలేదు.

No second consular access to Kulbhushan Jadhav, clarifies Pakistan

ఇక సెప్టెంబర్ 2వ తేదీన పాకిస్తాన్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లూవాలియా కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిశారు. అక్కడి ఓ సబ్‌ జైలులో ఉన్న జాదవ్‌తో దాదాపు గంట సేపు సమావేశం అయ్యారు. అయితే తను మాట్లాడుతున్న సమయంలో పాకిస్తాన్ అధికారులు ఉండరాదని భారత్ పాక్‌ను కోరింది. అయినప్పటికీ భారత్ విజ్ఞప్తిని పక్కన పెట్టిన పాకిస్తాన్.. గౌరవ్ అహ్లువాలియా మాట్లాడుతున్న సమయంలో తమ సిబ్బంది అక్కడే ఉండేలా జాగ్రత్త పడింది. ఇక పాక్ అధికారులు ఉండటమే కాదు.. కుల్‌భూషణ్, అహ్లువాలియాల మధ్య జరిగిన మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు.

English summary
Pakistan on Thursday blocked the consular access to Kulbhushan Jadhav, who has been sentenced to death by a Pakistani military court, saying that there would be no second access to the Indian national. The statement was released by the spokesperson of Ministry of Foreign Affairs in Pakistan, Mohammad Faisal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X