వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోబెల్ బహుమతులు: ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్‌ను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

|
Google Oneindia TeluguNews

ఓస్లో : రోజూ ఒక రంగానికి సంబంధించి నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్న నోబెల్ సంస్థ శుక్రవారం రోజున నోబెల్ శాంతి పురస్కారంను ప్రకటించింది. 2019 నోబెల్ శాంతి పురస్కారం ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్‌ను వరించింది. ఎరిట్రియా ఇథియోపియాల మధ్య నెలకొన్న వివాదంను అక్కడి పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకురావడంలో ఆయన పటించిన శాంతి మంత్రం, చేసిన కృషిని గుర్తిస్తూ నోబెల్ శాంతిపురస్కారంకు ఎంపిక చేసింది.

 సాహిత్యంలో నోబెల్ పురస్కారాలు: ఇద్దరి పేర్లను ప్రకటించిన స్వీడిష్ అకాడెమీ సాహిత్యంలో నోబెల్ పురస్కారాలు: ఇద్దరి పేర్లను ప్రకటించిన స్వీడిష్ అకాడెమీ

ఎరిట్రియాతో వివాదం పరిష్కరించిన అబి అహ్మద్

"ఎరిట్రియా ఇథియోపియాల మధ్య నెలకొన్న వివాదంను పరిష్కరించడంలో తన ప్రతిభను చూపినందుకుగాను, శాంతి నెలకొనేలా చర్యలు తీసుకున్నందుకు, అదే సమయంలో అంతర్జాతీయ సహకారం తీసుకుని ఎట్రియా ఇథియోపియా సరిహద్దు వివాదంను పరిష్కరించినందుకుగాను ప్రధాని అబి అహ్మద్‌ను ఈ ఏడు నోబెల్ శాంతి పురస్కారంతో గౌరవిస్తున్నాము" అని జ్యూరీ ప్రకటించింది.

 అబి అహ్మద్ నిర్ణయాలు దేశ రూపురేఖలను మార్చేశాయి

అబి అహ్మద్ నిర్ణయాలు దేశ రూపురేఖలను మార్చేశాయి

ఏప్రిల్ 2018లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇథియోపియాలో పెనుమార్పులు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు ప్రధాని అబి అహ్మద్. తాను తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు చాలామందిని ఆకట్టుకున్నాయి. దేశ రూపురేఖలను మార్చేశాయి. అప్పటి వరకు సరిహద్దు ఇట్రియా ప్రాంతం ఇథియోపియాల మధ్య యుద్ధవాతావరణమే కనిపించింది. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆరునెలల్లోనే ఇట్రియాతో శాంతి చర్చలు జరిపి విజయం సాధించారు. జైలులో మగ్గుతున్న ఇట్రియాకు చెందిన వారిని విడుదల చేయించారు. తమ దేశం చేసిన దానికి క్షమాపణలు చెప్పారు.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు

ఇక వచ్చే ఏడాది మేలో జరగునున్న ఎన్నికలకు అబి అహ్మద్ సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఇథియోపియా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వాటిని అమలు చేయడం కష్టమే అయినప్పటికీ వ్యక్తిగతంతా ఇథియోపియాకు ఏదో చేయాలన్న కసి తనను తిరిగి ప్రధానిని చేస్తుందని తన శ్రేయోభిలాషులు, సన్నిహితులు చెబుతున్నారు.

 అబి అహ్మద్ చరిత్ర

అబి అహ్మద్ చరిత్ర

అబి అహ్మద్ తండ్రి ముస్లిం కాగా తల్లి క్రైస్తవరాలు. తను బెషాషా పట్టణంలో పుట్టాడు. అబి అహ్మద్ చిన్నతనంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. వారు నివాసమున్న ఇంట్లో విద్యుత్ ఉండేది కాదు. నీటి సరఫరా ఉండేది కాదు. ఎక్కడో నదికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చుకునేవారని ఓ రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు. టీనేజర్‌గా ఉన్న సమయంలో టెక్నాలజీపై మక్కువతో మిలటరీలో రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వంలోకి రాకముందు అబి అహ్మద్ మిలటరీలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు.ఇథియోపియా సైబర్ సైయింగ్‌ శాఖకు అబి అహ్మద్ వ్యవస్థాపకుడు.

English summary
Ethiopian Prime Minister Abiy Ahmed was on Friday awarded the Nobel Peace Prize for his efforts to resolve his country's conflict with bitter foe Eritrea, the Nobel Committee said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X