వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహిత్యంలో నోబెల్ పురస్కారాలు: ఇద్దరి పేర్లను ప్రకటించిన స్వీడిష్ అకాడెమీ

|
Google Oneindia TeluguNews

2018కి 2019కి సాహిత్యంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్. ఈ ఏడాదికి అంటే 2019కిగాను సాహిత్యంలో ఆస్ట్రియాకు చెందిన రచయిత పీటర్ హాండ్‌కేను వరించగా... 2018కి గాను పోలాండ్‌కు చెందిన రచయిత ఓల్గా టోకార్‌జక్‌ను వరించింది. ఇదిలా ఉంటే గతేడాది సాహిత్యంలో నోబెల్ పురస్కరాలను ప్రకటించలేదు. స్వీడిష్ అకాడెమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో గతేడాది సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించలేదు.

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్: సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లకు ప్రాణం పోసినందుకు..కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్: సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లకు ప్రాణం పోసినందుకు..

 2019 సాహిత్యరంగంలో నోబెల్ పురస్కారం విజేత పీటర్ హాండ్‌కే

2019 సాహిత్యరంగంలో నోబెల్ పురస్కారం విజేత పీటర్ హాండ్‌కే

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఏడాది సాహిత్యరంగంలో విజేతగా నిలిచిన పీటర్ హ్యాండ్‌కే అత్యంత ప్రభావంతమైన రచయితగా గుర్తింపు పొందినట్లు స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది.భాషలతో మానవుడి అనుభవంను మేళవించి అందులో విశిష్టతను వెలికి తీయడంలో ప్రతిభ చాటినందుకుగాను పీటర్ హాండ్‌కేను ఈ అవార్డు వరించిందని స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది. దక్షిణ ఆస్ట్రియాలోని ఓ చిన్న గ్రామంలో 1942లో పీటర్‌హాండ్‌కే జన్మించారు. పీటర్ హాండ్‌కే స్లొవేనియన్ మైనార్టీలకు చెందిన వారు.

2018 విజేత ఓల్గా టోకర్ జక్

2018 విజేత ఓల్గా టోకర్ జక్

ఇదిలా ఉంటే 2018కి గాను సాహిత్య రంగంలో నోబెల్‌ బహుతి ఓల్గా టోకర్‌జక్‌ను వరించింది. సరిహద్దులు దాటడం జీవితంలో ఓ భాగం అని చెబుతూ ఓ చక్కటి కల్పిత కథనం రాసినందుకు ఓల్గాకు నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. నోబెల్ పురస్కారాలు అందుకున్న మహిళల్లో ఓల్గా 15వ మహిళ కావడం విశేషం. ఓల్గా 1962లో పోలాండ్‌లో జన్మించారు.1993లో ఆమె నవలలు రాయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 11 నోబెల్ పురస్కారాల విజేతలను అకాడెమీ ప్రకటించింది.ఇందులో విజేతలంతా పురుషులే కావడం విశేషం.

స్వీడిష్ అకాడెమీలో లైంగిక వేధింపులు

2018లో నోబెల్ ఫౌండేషన్ సాహిత్య రంగంలో పురస్కారాన్ని ప్రకటించలేదు. సాహిత్యరంగంలో పురస్కారాలను నిలిపివేయాల్సిందిగా స్వీడిష్ అకాడెమీని ఆదేశించింది.స్వీడిష్ అకాడెమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నోబెల్ ఫౌండేషన్ రంగంలోకి దిగి ఈ నిర్ణయం తీసుకోవడంతో గతేడాది సాహిత్యరంగంలో నోబెల్ విజేతను ప్రకటించలేదు. అంతేకాదు, ఆర్థిక పరమైన అంశాల్లో అవకతవకలు, అవినీతి జరిగినట్లు కూడా ఆరోపణలు రావడంతో ఈ అవార్డును గతేడాది నిలిపివేశారు.

ఏడు సార్లు నోబెల్ ప్రైజ్‌ను నిలిపివేసిన అకాడెమీ

ఏడు సార్లు నోబెల్ ప్రైజ్‌ను నిలిపివేసిన అకాడెమీ

2017లో ఉద్యమంలా సాగిన మీ టూ క్యాంపెయిన్‌లో ఫ్రెంచ్ స్వీడిష్ ఫోటోగ్రాఫర్ జీన్ - క్లాడ్అర్నాల్ట్ తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ 18 మంది మహిళలు ఫిర్యాదు చేశారు. ఇలా 20 ఏళ్లకుపైగా తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని మహిళలు ఫిర్యాదు చేశారు. జీన్ క్లాడ్ స్వీడిష్ అకాడెమీ సభ్యురాలైన ప్రముఖ కవియిత్రి క్యాతరీనా ఫ్రోస్టెన్‌సన్‌ను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే 1786లో ఏర్పాటు అయిన స్వీడిష్ అకాడెమీ...పురస్కారాలు ఇవ్వకుండా ఏడు పర్యాయాలు నిలిపివేసింది. 1915,1919,1925, 1926,1927వ సంవత్సరాల్లో నోబెల్ అందుకునేంత స్థాయిలో ఎవరి రచనలు లేకపోవడంతో నిలిపివేసింది.

English summary
Two Nobel Prizes in literature one for 2019 and one for 2018 — were announced Thursday by the Royal Swedish Academy of Sciences. Austrian author Peter Handke is the winner of Nobel in literature this year and the postponed award for 2018 went to Polish author Olga Tokarczuk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X