వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోబెల్ ప్రైజ్ 2019: వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్..వీరు ఏం కనుగొన్నారంటే..?

|
Google Oneindia TeluguNews

ప్రతిష్టాత్మక అవార్డు నోబెల్ ప్రైజ్ సందడి ప్రారంభమైంది. 2019కి గాను వైద్యశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను విలియం జీ కేలిన్, సర్ పీటర్ రాట్‌క్లిఫ్, మరియు గ్రెగ్ ఎల్ సెమెంజాలను నోబెల్ ప్రైజ్ వరించింది. వైద్యరంగంలో చేసిన కృషికిగాను ఈ ముగ్గురికి నోబెల్ సంస్థ అవార్డును ప్రకటించింది. శరీరంలో తక్కువ శాతం ఆక్సిజెన్ లెవెల్స్ ఉన్నసమయంలో శరీరంలోని భాగాలు ఎలా రెస్పాండ్ అవుతాయనేదానిపై వీరు పరిశోధనలు చేసి విజయం సాధించారు. శరీరంలో ఆక్సిజెన్ లెవెల్స్ తగ్గిపోతే హార్మోన్ ఎరిత్రోపోయెటిన్‌లో కొన్ని మార్పలు చోటుచేసుకుంటాయని తెలిపారు. దీంతో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందని తద్వారా శరీరంకు ఆక్సిజెన్ సరఫరా అవుతుందని వీరు రుజువు చేశారు.

ఆక్సిజెన్ శాతం శరీరంతో పడిపోయినప్పుడు ప్రొటీన్ కాంప్లెక్స్ (హెచ్ ఐ ఎఫ్)పెరుగుతుందని చెప్పారు. శరీరంలో ఆక్సిజెన్ స్థాయి సాధారణంగా ఉన్నప్పుడు హెఐఎఫ్ విరిగిపోతుందని చెప్పారు. అదే ఆక్సిజెన్ లెవెల్స్ తక్కువగా ఉన్నసమయంలో ఈ ప్రొటీన్ కాంప్లెక్స్ తిరిగి నిర్మాణం అవుతుందని చెప్పారు. క్రమంగా డీఎన్‌ఏలో కలిసిపోయి ఈపీఓ హార్మన్‌ను యాక్టివ్ చేస్తాయని నిరూపించారు. ఇలా ఆక్సిజన్‌తో ముడిపడి ఉన్న సున్నితమైన అవయావలపై అధ్యయనం చేశారు.

Nobel Prize 2019:William,PeterRatcliffe and Gregg Semenza wins nobel in Medicine

ఈసారి మాత్రం వైద్యరంగంలో నోబెల్ బహుమతి గెలిచిన వారు నిజంగానే సంబరాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్థాయిలో పరిశోధనలు ఇంతకుమునుపెన్నడూ ఎవరూ చేయలేదు. అదికూడా శరీరంలో ఆక్సిజెన్ లెవెల్స్ పడిపోతున్న సమయంలో అవయావాలు ఎలా రెస్పాండ్ అవుతాయనే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌పై పరిశోధనలు చేసి విజయం సాధించారు. ఇక ఈ ముగ్గురు వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న చాలామంది పేషెంట్లపై ప్రయోగాలు చేసి విజయం సాధించారు. క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నవారు తక్కువ ఈపీఓ కలిగి ఉండటం వల్ల తీవ్ర స్థాయిలో అనేమియా వచ్చి బాధపడుతుంటారని విలియం జీ కేలిన్, సర్ పీటర్ రాట్‌క్లిఫ్, మరియు గ్రెగ్ ఎల్ సెమెన్‌జాలు తెలిపారు.

క్యాన్సర్ వచ్చిన సమయంలో అందులోని ట్యూమర్లు ఆక్సిజెన్‌ను సరఫరా చేసే వ్యవస్థను వినియోగించుకుని కొత్త రక్తకణాలను సృష్టించుకుంటాయని చెప్పారు. అయితే దీనిపై పూర్తిస్థాయిలో ఇంకా స్టడీ చేయాల్సి ఉందని చెప్పారు. దీని ద్వారా వ్యాధిని నయం చేసే కొత్త మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. విలియం జీ కేలిన్, సర్ పీటర్ రాట్‌క్లిఫ్, మరియు గ్రెగ్ ఎల్ సెమెన్‌జాలు ముగ్గురికి అవార్డులు రావడం కొత్త కాదు. 2016లో ఈ త్రయం ఆల్బర్ట్ లస్కర్ బేసిక్ మెడికల్ రీసెర్చ్ అవార్డును గెలుపొందారు. ఈ అవార్డులను అమెరికా నోబెల్ అవార్డుగా పిలుస్తారు.

English summary
The 2019 NobelPrize in Physiology or Medicine has been awarded jointly to William G. Kaelin Jr, Sir Peter J. Ratcliffe and Gregg L. Semenza “for their discoveries of how cells sense and adapt to oxygen availability.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X