వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి: ఐదో మహిళగా ఆర్నాల్డ్

|
Google Oneindia TeluguNews

స్టాక్‌హోమ్: రసాయన శాస్త్ర విభాగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం ఈ సంవత్సరం ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఫ్రాన్సెస్‌ హెచ్‌ అర్నాల్డ్‌, పరిశోధకులు జార్జ్‌ పి స్మిత్‌, బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు సర్‌ గ్రెగొరీ పి వింటర్‌ ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

ప్రొటీన్లను ఉపయోగించి జీవవైవిధ్య ఇంధనం నుంచి ఔషధాల తయారీ వరకు.. వివిధ రంగాల్లో వినూత్నమైన ఆవిష్కరణలకు గానూ వీరికి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద అందే రూ. 7.35కోట్లలో సగం సొమ్మును ఫ్రాన్సెస్‌ ఆర్నాల్డ్‌కు, మిగతా మొత్తాన్ని జార్జ్‌ స్మిత్‌, గ్రెగొరీ వింటర్‌కు పంచుతున్నట్లు ఎంపిక కమిటీ 'రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌' వెల్లడించింది.

మహిళ సహా ముగ్గురికి ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి: ఆర్థర్, గెరార్డ్, డొన్నాలకు పురస్కారం మహిళ సహా ముగ్గురికి ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి: ఆర్థర్, గెరార్డ్, డొన్నాలకు పురస్కారం

 Nobel Prize in Chemistry 2018 goes to Frances H Arnold, George P Smith and Sir Gregory P Winter

కాగా, రసాయన శాస్త్రంలో నోబెల్‌ అందుకున్న ఐదో మహిళగా ఫ్రాన్సెస్‌ ఆర్నాల్డ్‌ ఘనత సాధించారు. అంతకుముందు మరియా స్కోలోడోవోస్కా క్యూరీ(1911), ఇరెనె జోలియట్‌ క్యూరీ(1935), డొరొతీ క్రోఫూట్‌ హాడ్‌కిన్‌(1964), అడా ఇ యోనత్‌(2009) రసాయన శాస్త్రంలో నోబెల్‌ అందుకున్నారు.

ఈ ఏడాది నోబెల్‌ అవార్డుల ప్రకటన సోమవారం నుంచి ప్రారంభమైంది. అక్టోబరు 5న నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్‌ పురస్కారాల విజేతలను వెల్లడించనున్నారు. లైంగిక ఆరోపణల కారణంగా ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతి ప్రకటించడం లేదు.

English summary
The Nobel Prize in Chemistry for the year 2018 has been announced. Frances H. Arnold won one half of the prize for his work in the field of directed evolution of enzymes while George P. Smith and Sir Gregory P. Winter won the other half of the coveted prize for their work in area of the phage display.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X