వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థికశాస్త్రంలో విలియం నోర్దాస్, పాల్ రోమర్లకు నోబెల్ బహుమతి

|
Google Oneindia TeluguNews

పర్యావరణం పరిరక్షించడమంటే ఈరోజుల్లో కత్తిమీద సాములాంటిదే అని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై చాలామంది చర్చిస్తున్నారు. దీనిపై అనేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు ముందుకేశారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి తద్వారా కొంతలో కొంతైన తమ వంతు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు విలియం నార్దాస్, పౌల్ రోమర్‌లు చేసిన కృషిని గుర్తిస్తూ 2018 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఆ సంస్థ ప్రకటించింది.

<strong>ముక్వేజ్, నదియాలకు నోబెల్ శాంతిబహుమతి </strong>ముక్వేజ్, నదియాలకు నోబెల్ శాంతిబహుమతి

పర్యావరణంలో మార్పులను సాంకేతిక ఆవిష్కరణలతో సమగ్రం చేసి స్థూలఆర్థిక విశ్లేషణలు చేసినందుకుగాను విలియం నార్దాస్, పౌల్ రోమర్లకు ఆర్థికశాస్త్రంలో నోబెల్‌‌ను ప్రకటించడం జరిగింది. స్వతహాగా ఆర్థికవేత్త అయిన విలియం నార్దాస్ యేల్ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ రూపకల్పన మరియు వాతావరణంలో మార్పులపై పలు పరిశోధనలు చేశారు. పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆర్థికంగా ఏమేరకు ప్రభావితం చేస్తున్నాయనే దానిపై పరిశోధనలు చేసి వాటికి పరిష్కార మార్గాలు కూడా చెప్పారు. అంతేకాదు ఆర్థిక వ్యవస్థకుచ ఎనర్జీ వినియోగంకు, పర్యావరణ మార్పులకు సంబంధం ఉందని తన పరిశోధనల ద్వారా నిరూపించారు.

Nobel Prize in Economics awarded to William Nordhaus and Paul Romer

పాల్ రోమర్ కూడా ఎకానమిస్టే. అంతర్జనిత పెరుగుదల సిద్ధాంతాన్ని ఈయన వివరించారు. ఇది నూతన ఆవిష్కరణలు, జ్ఞానం పెంపొందించుకునేందుకు అంతర్జనిత సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ఇది ఆర్థిక పెరుగుదలకు ఎలా దోహదపడుతుందో చెప్పారు. చాలామంది ప్రజలు పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను విస్మరిస్తారన్నారు. ఇందుకు కారణం పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను నియంత్రించడం అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నదనే అపోహ వారిలో ఉందని పేర్కొన్నారు. అయితే నిజంగా పర్యావరణంలో మార్పులు నియంత్రించాలనుకుంటే అందుకు చాలా దార్లున్నాయని రోమర్ తెలిపారు.

English summary
Protecting the environment has become a major concern across the globe as more people are talking about climate change. A number of people are trying to find innovative options that can help reduce emissions and make environmental protection easier for everyone.American duo William Nordhaus and Paul Romer have been awarded the 2018 Nobel Prize in Economics for their efforts in this direction. They were honoured for integrating climate change and technological innovation into macroeconomic analysis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X