వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళ సహా ముగ్గురికి ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి: ఆర్థర్, గెరార్డ్, డొన్నాలకు పురస్కారం

|
Google Oneindia TeluguNews

స్వీడన్: భౌతికశాస్త్రంలో మంగళవారం నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. ముగ్గురికి ఈ పురస్కారం లభించింది. ఆర్థర్ ఆష్కిన్ (అమెరికా), గెరార్డ్ మౌరా (ఫ్రాన్స్), డోన్నా స్క్రిక్లాండ్ (కెనడా)లను నోబెల్ వరించింది.

<strong>2018 నోబెల్ బహుమతులు: క్యాన్సర్‌పై పరిశోధనలకుగాను జేమ్స్, హోంజోలకు నోబెల్ </strong>2018 నోబెల్ బహుమతులు: క్యాన్సర్‌పై పరిశోధనలకుగాను జేమ్స్, హోంజోలకు నోబెల్

అక్టోబర్ నెల రాగానే ప్రపంచమంతా నోబెల్ బహుమతులపై ఆసక్తిగా ఎదురు చూస్తుంది. డైనమెట్ రూపకర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ఈ పురస్కారాలను వివిధ రంగాల్లో అత్యుత్తమ పరిశోధనలకు, సేవలకుగాను అందజేస్తుంటారు.

Nobel Prize in Physics is shared by a woman, the first in 55 years

వైద్యశాస్త్ర విభాగంలో తొలి విజేతను ప్రకటించడం ద్వారా ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతుల పండుగ ప్రారంభమవుతుంది. సోమవారం అలిసన్, హోంజో జంటకు వైద్యరంగ నోబెల్ ప్రకటించిన రాయల్ స్వీడిష్ ఎకాడమీ, మంగళవారం భౌతికశాస్త్రంలో ప్రకటించింది. బుధవారం రసాయన శాస్త్రం పురస్కారాలను ప్రకటించనుంది.

శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటిస్తారు. నోబెల్ సాహిత్య పురస్కారంపై గత మూడేళ్లుగా వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈసారి కూడా సాహిత్య నోబెల్ ప్రదానాన్ని వాయిదా వేశారు. 2018 సంవత్సరపు నోబెల్‌ను వచ్చే ఏడాది పురస్కారాలతోపాటే అందజేస్తామని రాయల్ స్వీడిష్ ఎకాడమి ప్రకటించింది. 1949లో విలియం ఫ్రాల్కనర్స్‌కు ప్రకటించిన పురస్కారాన్ని తర్వాత ఏడాది 1950 పురస్కారాలతోపాటు అందించారు. ఆ తర్వాత సాహిత్య నోబెల్‌ను ఇలా వాయిదా వేయడం ఇదే తొలిసారి.

English summary
The 2018 Nobel Prize in Physics has been awarded to Arthur Ashkin, and the other half jointly to Gérard Mourou and Donna Strickland "for their groundbreaking inventions in the field of laser physics."
Read in English: Nobel Prize 2018 in Physics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X