వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాకు నోబెల్: పెద్ద తప్పిదమన్న మాజీ డైరెక్టర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఓస్లో: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై ఎన్ఎన్ఐ (నార్వే నోబెల్ ఇన్స్‌టిట్యూట్) మాజీ డైరెక్టర్ లుండెస్టెడ్ విచారం వ్యక్తం చేశారు. నోబెల్ బహుమతి ఒబామాను మరింతగా ప్రోత్సహించేలా ఉంటుందని భావించామన్నారు.

నోబెల్ కమిటీ ఏదైతే ఆశించి 2009లో ఆయనకు అవార్డును ప్రకటించిందో, ఆ ఆశలను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందంటే ఆయనే నమ్మలేకపోయారని పేర్కొన్నారు.

ఒబామా మద్దతుదారులు సైతం నోబెల్ అవార్డుల కమిటీ తప్పు చేసిందని ఇప్పటికీ భావిస్తున్నారని తాను రాసిన పుస్తకంలో లుండెస్టెడ్ వివరించారు. నోబెల్ శాంతి బహుమతికి ఒబామా అర్హుడు కాదంటూ చాలా మంది అమెరికన్లు అభిప్రాయపడతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Nobel secretary regrets Obama peace prize

2009లో నోబెల్ కమిటీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఏడాది ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. 2009లో నోబెల్ శాంతి బహుమతి కోసం 205 మంది పోటీ పడ్డారు.

అయితే అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి కృషి చేస్తూ ప్రపంచ శాంతి కోసం పనిచేసినందుకు గాను ఒబామాకు ఈ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. అమెరికా అత్యున్నత పదవిని అధిష్ఠించిన తొలి ఆఫ్రికన్ - అమెరికన్ ఒబామా నిరాయుధీకరణకు అప్పట్లో పిలుపునిచ్చారు. అంతేకాదు ఆగిపోయిన మధ్య ప్రాచ్య శాంతి చర్చల పునరుద్ధరణకు కృషి చేశారు.

English summary
Awarding the Nobel Peace Prize to US President Barack Obama in 2009 failed to achieve what the committee hoped it would, its ex-secretary has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X