వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్వాసన: నోకియాలో భారీగా ఉద్యోగాల కోత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు ఆదరణ పెరగడంతో నోకియా ఆ పోటీని తట్టుకోలేక పోయిన సంగతి తెలిసిందే. క్రమేపీ అమ్మకాల్లో భారీ నష్టాలు చవిచూడటంతో సంస్ధ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఖర్చు తగ్గించుకోవడానికి గాను గత కొంతకాలంగా ఉద్యోగుల్లో భారీ కోత పెడుతొన్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా కాస్ట్ కటింగ్ పేరుతో గత దశాబ్ద కాలంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తోంది. తాజాగా కంపెనీ సొంతదేశమైన ఫిన్‌లాండ్‌లో 1,032 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు నోకియా ప్రకటించింది. భారీ నష్టాల కారణంగానే సంస్ధ ఈ నిర్ణయం తీసుకుంది.

నోకియా ఇటీవలే అల్కాటెల్‌ ల్యూసెంట్‌ అనే కంపెనీని విలీనం చేసుకుంది. విలీన నేపథ్యంలో బిలియన్ డాలర్ ఆదాయాన్ని మిగిల్చుకునే వ్యూహంలో భాగంగా మరికొందరు ఉద్యోగులను తొలగించింది. భవిష్యత్తులోనూ మరిన్ని ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Nokia confirms another 1000 layoffs in Finland

అయితే ఎంతమందిని తీసేస్తుందన్న విషయంపై ఖచ్చితమైన వివరాలు ఇచ్చేందుకు సంస్థ నిరాకరించింది. ఆయా దేశాల్లో తమ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో నోకియా కంపెనీకి సుమారు ఒక లక్షా నాలుగువేల మంది ఉద్యోగులు ఉన్నారు.

అందులో ఫిన్ లాండ్‌లో 6,850, జర్మనీలో 4800, ఫాన్స్‌లో 4,200 మంది ఉన్నారు.

English summary
As a late Friday coda to this week’s news of Nokia’s old feature phone business getting sold once again, today Nokia quietly confirmed it is laying off 1,032 employees in its home market of Finland. The cuts will come across all business units.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X