వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాసా అపూర్వ ప్రయోగం: చందమామపై 4జీ మొబైల్ నెట్‌వర్క్: నోకియాకు కాంట్రాక్ట్: విలువెంతో తెలుసా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో అద్భుత ప్రయోగానికి తెర తీసింది. చందమామపై కనీవినీ ఎరుగని ప్రయోగాన్ని చేపట్టబోతోంది. చంద్రుడిపై భూమిని అమ్ముతామని, ప్లాట్లను ఏర్పాటు చేస్తామంటూ ఇదివరకు వార్తలు వచ్చినప్పటికీ.. అవి నమ్మశక్యం కానివే. దీనికి భిన్నంగా నాసా శాస్త్రవేత్తలు సంచలనానికి సిద్ధపడుతున్నారు. జాబిల్లిపై ఏకంగా 4జీ నెట్‌వర్క్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థను నెలకొల్పబోతున్నారు.

Recommended Video

Nokia “Connecting Moon”, Nokia Wins NASA Contract to Put 4G Network on Moon| First LTE/4G in Space
చంద్రుడి మీద మొబైల్ నెట్‌వర్క్

చంద్రుడి మీద మొబైల్ నెట్‌వర్క్

భూమి మీద మనం వినియోగిస్తోన్న 4జీ సెల్యులార్ నెట్‌వర్క్ ప్రమాణాలకు ఎన్నో రెట్లు మెరుగ్గా.. మరింత వేగవంతమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన వ్యవస్థను చంద్రుడిపైన ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రారంభ పనులను నాసా శాస్త్రవేత్తలు చేపట్టారు. 4జీ నెట్‌వర్క్ వ్యవస్థను నెలకొల్పే కాంట్రాక్టు పనులను ప్రముఖ సెల్యులార్ సంస్థ నోకియా దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 370 మిలియన్ డాలర్లు కాగా.. ప్రారంభదశలో 14.1 మిలియన్ డాలర్లను నాసా ఖర్చు చేయబోతోంది.

చంద్రుడు హెడ్ క్వార్టర్‌గా అంతరిక్ష ప్రయోగాలు..

4జీ నెట్‌వర్క్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే పనులను నోకియా మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాసా చంద్రుడిపై సూచించిన టిప్పింగ్ పాయింట్ల వద్ద నోకియా.. 4జీ నెట్‌వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం అనుకున్నది అనుకున్నట్లుగా సాగితే.. చంద్రుడిని ఆధారంగా లేదా ప్రధాన కేంద్రంగా చేసుకుని.. నాసా అంతరిక్ష ప్రయోగాలను చేపట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

4జీ సెల్యులార్ నెట్‌వర్క్ కోసం..

4జీ సెల్యులార్ నెట్‌వర్క్ కోసం..

నోకియాకు 4జీ సెల్యులార్ నెట్‌వర్క్ కాంట్రాక్టు అప్పగించిన విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. భూమిపై కంటే కూడా అత్యంత వేగంగా, మెరుగ్గా 4జీ నెట్‌వర్క్ సేవలు ఉంటాయని తాము అంచనా వేస్తున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టెయిన్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. యునైటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని వెల్లడించింది. 2028 నాటికి చంద్రుడిని ప్రధాన కేంద్రంగా చేసుకుని అంతరిక్ష ప్రయోగాలను సాధించాలనే లక్ష్యాన్ని అందుకునే దిశగా ఓ అడుగు ముందుకు పడినట్లు పేర్కొన్నారు.

సవాళ్లు అధికమే..

సవాళ్లు అధికమే..

గాలి లేని ప్రదేశంలో 4జీ నెట్‌వర్క్‌ వ్యవస్థను నెలకొల్పడమనేది అనేక సవాళ్లతో కూడిన అంశమని, అయినప్పటికీ.. దాన్ని సాధించగలమని చెప్పారు. చంద్రుడి ఉపరితలంపై సుదీర్ఘకాలం పాటు సేవలను అందించగల పవర్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ తరువాతే.. అక్కడ నివాసం ఉండటానికి చర్యలు చేపడతామని అన్నారు. చంద్రుడిపై 4జీ సెల్యులార్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న విషయాన్ని నోకియా ధృవీకరించింది.

డ్రిల్లింగ్ ఎలా?

డ్రిల్లింగ్ ఎలా?

నోకియా రీసెర్చ్ యూనిట్ బెల్ ల్యాబొరేటరీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇన్‌ట్యూటివ్ మెషీన్స్ సంస్థ సహకారంతో తాము ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొంది. చంద్రుడిపై డ్రిల్లింగ్ చేయదగ్గ పరికరాలను ఇన్‌ట్యూటివ్ మెషీన్స్ రూపొందిస్తుందని స్పష్టంచేసింది. చంద్రుడి ఉపరితలాన్ని డ్రిల్లింగ్ చేయడం అనేక సవాళ్లతో కూడుకున్న అంశమని, దాన్ని తాము సాధిస్తామని బెల్ ల్యాబొరేటరీస్ తెలిపింది.

డేటా ట్రాన్స్‌మీషన్ కోసం..

డేటా ట్రాన్స్‌మీషన్ కోసం..

జాబిల్లిపై ప్రయోగాలను చేయడానికి నాసా పంపించే రోవర్లను సరైన దిశలో నడిపించడం, రియల్ టైమ్ నేవిగేషన్, చంద్రుడి ఉపరితలంపైకి డేటాను బదిలీ చేయడం, హైడెఫినిషన్ సామర్థ్యం గల వీడియోలను అందించడం వంటి చర్యల కోసం 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారని, వారి అంచనాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని బెల్ ల్యాబ్స్ వెల్లడించింది. త్వరలోనే తాము ఈ పనులను ప్రారంభిస్తామని పేర్కొంది.

English summary
NASA has awarded Nokia of the US $14.1 million to deploy a 4G cellular network on the moon. The grant is part of $370 million worth of contracts signed under NASA's "Tipping Point" selections, meant to advance research and development for space exploration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X