• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దడ పుట్టించే 'అస్త్రం': ఉ.కొరియాతో యుద్దం అంటే పారిపోవాల్సిందే.., ఎక్కడిదీ వెరుపులేని తనం?

|

ప్యోంగ్‌యాంగ్: దేశం చిన్నదే కావచ్చు. కానీ ఉత్తరకొరియా సైనిక శక్తి అగ్ర రాజ్యానికి ధీటుగా ఉందన్న సంకేతాలు విస్మరించలేనివి. అమెరికాను ఢీకొట్టడానికి ఏమాత్రం వెరుపు లేకుండా వ్యవహరించడం వెనుక సైనిక శక్తి ఒక్కటే కారణం కాదు.

ఏక కాలంలో అణు శక్తిని, బయోలాజికల్ వెపన్స్ ను ఉత్తరకొరియా అభివృద్ది చేసుకుంటూ వస్తోంది. జపాన్, దక్షిణ కొరియాలతో జతకట్టినా సరే.. దౌత్య పరంగా తమను ఒంటరి చేసినా సరే.. అణు ప్రయోగాల విషయంలో ఉత్తరకొరియా ఎక్కడా తగ్గలేదు.

ఐక్యరాజ్య సమితి ఆదేశాలను సైతం పక్కనబెట్టి.. స్వీయ రక్షణ కోసమే అణ్వాయుధ తయారీ చేసుకుంటున్నామని పదేపదే చెబుతోంది. ఉత్తరకొరియా అణు సామర్థ్యంపై వ్యక్తమైన అనుమానాల్లాగే.. ఇప్పుడు ఆ దేశంలో తయారవుతున్న బయోలాజికల్ వెపన్స్‌పై కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

'రుతుస్రావం'.. కొన్ని కఠిన నిజాలు: ఉ.కొరియాలో మహిళా సైనికుల దీనగాథ.. స్నానం చేయాలన్నా!

నిజంగా ఆ దేశానికి సొంతంగా బయోలాజికల్ వెపన్స్ తయారుచేసుకునే సత్తా ఉందా? అన్న ప్రశ్న అందులో ప్రధానంగా వినిపిస్తోంది. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఉత్తరకొరియా సామర్థ్యాన్ని చిన్నచూపు చూడటం సరికాదనే వాదన కూడా వినిపిస్తోంది.

అమెరికా తలరాత మా చేతుల్లో:

అమెరికా తలరాత మా చేతుల్లో:

ఉత్తరకొరియా అధికారిక పత్రిక మింజు చోసన్ ప్రచురించిన ఓ వ్యాసం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికాపై ఉత్తరకొరియా పోరాటం వెరుపులేనిది అనే రీతిలో ఆ వ్యాసం ప్రచురితమైంది.

'అమెరికా తలరాత ఇక ఉత్తరకొరియా చేతుల్లోనే ఉంది. బ్లాక్‌మెయిలింగ్‌, బయటపెట్టడాలు ఇక మా ముందు చెల్లవు. అది అమెరికాకు నచ్చినా.. నచ్చకపోయినా.. మాకు అనవసరం. కవ్వింపు ప్రకటనలతో ట్రంప్‌ తన దేశానికి పెను ముప్పును తేవాలని చూస్తున్నాడు. అందుకే యుద్ధం కోసం కాలు దువ్వుతున్నాడు. ఆ లెక్కన ట్రంప్‌ మరణశయ్యపై ఉన్నట్లే లెక్క' అంటూ ఆ వ్యాసంలో పేర్కొనడం గమనార్హం. ఉత్తరకొరియా కేబినెట్ నుంచి సేకరించిన అభిప్రాయంగా ఈ వ్యాసాన్ని ప్రచురించారు.

గెలిచి తీరుతాం: ప్రతినబూనిన 'కిమ్'.., ఆ సదస్సులో ఇలా!, భయంలో అమెరికా?

బయోలాజికల్ వెపన్స్:

బయోలాజికల్ వెపన్స్:

అమెరికన్, ఆసియా ఇంటలిజెన్స్ వర్గాల నివేదికల ప్రకారం బయోలాజికల్ వెపన్స్ తయారుచేయడంలో ఉత్తరకొరియా నిమగ్నమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున బయోలాజికల్ వెపన్స్ ను ఆ దేశం తయారుచేసుకుందని తెలుస్తోంది.

భారీ విధ్వంస ఆయుధాల (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్-డబ్ల్యూఎండీ) నిపుణుడు జోషువా పొల్లాక్ కూడా ఉత్తరకొరియాకు ఆ సామర్థ్యం ఉందనే అంటున్నారు. బయోలాజికల్ వెపన్స్ తయారీ కోసం, అందుకు అవసరమైన ఆయుధాల దిగుమతి కోసం ఉత్తరకొరియా భారీగా ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు.

ఏంటీ 'బైనరీ ఫామ్'?: సోదరుడి హత్య వెనుక కిమ్ ప్లాన్ ఇదే.., ఊహకందని రీతిలో..

13రకాల బయోలాజికల్ ఏజెంట్స్:

13రకాల బయోలాజికల్ ఏజెంట్స్:

నివేదికలు చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం ఉత్తరకొరియా వద్ద 13రకాల బయోలాజికల్ ఏజెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలో వీటిని ఆయుధాలుగా ప్రయోగించవచ్చని, వీటిల్లో స్మాల్ పాక్స్, ఆంథ్రాక్స్ వంటి ప్రాణాంతక ఏజెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం.

పొల్లాక్ దీనిపై మాట్లాడుతూ.. ' ఆంథ్రాక్స్ అనే బాక్టీరియా ప్రంపంచలో ఎక్కడైనా.. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనగలుగుతుంది. ప్రయోగించిన ప్రాంతం నుంచి ఆ చుట్టుపక్కలకు వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి బయోలాజికల్ వెపన్స్ ద్వారా ప్రయోగించడానికి ఆంథ్రాక్స్ ఏజెంట్ ను ఉత్తరకొరియా ఉపయోగించుకోవచ్చు' అని చెప్పుకొచ్చారు.

ఆ ఇద్దరికీ శిక్ష విధించిన కిమ్: కారణమేంటి?.., ద.కొరియా ఆసక్తికర కథనం..

ఆఖరి అస్త్రంగా ప్రయోగించడానికి:

ఆఖరి అస్త్రంగా ప్రయోగించడానికి:

ఇప్పటిదాకా అణు క్షిపణులతోనే అమెరికాను భయపెడుతూ వచ్చిన ఉత్తరకొరియా.. పరిస్థితులు ముంచుకొస్తే బయోలాజికల్ వార్ ప్రకటించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ జెమ్స్ రూపంలో అమెరికాపై మెరుపు దాడి చేయడానికి ఆ దేశం సమాయత్తంగా ఉందని, ఆఖరి అస్త్రంగా ఉత్తరకొరియా బయోలాజికల్ వెపన్స్ ఉపయోగించవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రహస్యంగా అక్కడికెళ్లిన కిమ్: ఐరాస నివేదికలో షాకింగ్ నిజాలు, అమెరికాకు దడ..

సైనిక పరంగాను, క్షిపణుల పరంగాను, ఇప్పుడు బయోలాజికల్ వెపన్స్ పరంగాను ఉత్తరకొరియా ఒక తిరుగులేని శక్తిగా అవతరించడానికి సిద్దపడుతున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాను ఢీకొట్టడానికి వెనుకాడకపోవడం వెనుక ఇవే ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు.

English summary
The country's state-run newspaper Minju Choson - published by the North Korean cabinet - has written in a commentary that fearful of the North Korean might, the fate of America is in hands of its supreme leader Kim Jong-un.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X