వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉ.కొరియా ఎఫెక్ట్: ట్రంప్ అలా చేస్తే చైనాకు నష్టం, హైడ్రోజన్ బాంబుపై భారత్ ఆందోళన

ఉత్తర కొరియా వరుస అణుబాంబుల ప్రయోగాలు చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఉత్తర కొరియాకు త్వరలోనే దీటుగా జవాబిస్తామన్నారు.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఉత్తర కొరియా వరుస అణుబాంబుల ప్రయోగాలు చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఉత్తర కొరియాకు త్వరలోనే దీటుగా జవాబిస్తామన్నారు.

చదవండి: నిన్న హైడ్రోజన్ బాంబు, మరో అణు పరీక్షకు ఉత్తరకొరియా సిద్ధం

ట్రంప్ నిర్ణయం సరికాదు

ట్రంప్ నిర్ణయం సరికాదు

ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాతో సంబంధాలు కొనసాగించే దేశాలతో అమెరికా వాణిజ్యపరంగా తెగదెంపులు చేసుకుంటుందని ట్రంప్‌ హెచ్చరించారు. దీంతో ట్రంప్‌ వ్యాఖ్యలపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఆమోదయోగ్యం కాదని, సరైన నిర్ణయం కాదని చైనా పేర్కొంది.

ఖండించిన చైనా విదేశాంగ అధికార ప్రతినిధి

ఖండించిన చైనా విదేశాంగ అధికార ప్రతినిధి

ఉత్తర కొరియా దూకుడు సమస్యను తాము శాంతియుతంగా పరిష్కరించాలని చూస్తుంటే ట్రంప్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ షౌంగ్‌ అన్నారు.

ట్రంప్ అలా చేస్తే చైనాకు భారీ నష్టం

ట్రంప్ అలా చేస్తే చైనాకు భారీ నష్టం

ట్రంప్‌ వ్యాఖ్యలు పరోక్షంగా చైనాను హెచ్చరించినట్లే. ఎందుకంటే వాణిజ్యపరంగా చైనా ఉత్తర కొరియాకు ప్రధాన దేశం. అంతేగాక ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ట్రంప్‌ తన నిర్ణయాన్ని అమలు చేస్తే చైనాకు ఆర్థికంగా భారీ నష్టం తప్పదు. ప్రస్తుతం అమెరికా చైనా నుంచి నెలకు 40 బిలియన్‌ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. వాణిజ్య సంబంధాలు తెంచుకుంటే చైనా తీవ్రంగా నష్టపోతుందని అంచనా వేస్తున్నారు.

ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగంపై భారత్ ఆందోళన

ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగంపై భారత్ ఆందోళన

ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా హైడ్రోజన్‌ బాంబు పరీక్షించిందనగానే భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ దేశాల్లో అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా ఒక జట్టు అన్నట్లు ఉంటాయి. ఇక వివాదాస్పద దేశాలైన చైనా, పాకిస్థాన్‌, ఉత్తర కొరియా ఒక జట్టుగా కొనసాగుతాయన్నది విశ్లేషకుల మాట. రష్యా వ్యాపార అవసరాలను బట్టి చైనా గ్రూప్‌, భారత్‌తో సత్సంబంధాలను కలిగి ఉంటుంది. ఈ విషయంలో భారత్‌ చాలా వరకు తటస్థంగా ఉంటుంది.

ఉత్తర కొరియాకు చైనా సహకారం

ఉత్తర కొరియాకు చైనా సహకారం

ఉత్తర కొరియాకు అమెరికాకు మధ్య ఉన్న వైరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దేశానికి కూడా అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోంది చైనా. ఇదిలా ఉండగా, 1980 నాటి నుంచి పాక్‌-ఉత్తర కొరియాలు రక్షణ పరిజ్ఞానాన్ని పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ ఘోరీ క్షిపణి తయారు చేసింది. ఈ రెండు దేశాల మధ్య క్షిపణి పరిజ్ఞాన బదిలీకి చైనా ప్రోత్సాహం ఉందనే వాదనలు ఉన్నాయి.

పాకిస్తాన్‌కు పంచినా ఆశ్చర్యం లేదు

పాకిస్తాన్‌కు పంచినా ఆశ్చర్యం లేదు

ఉత్తర కొరియా పరీక్షించే క్షిపణుల్లో అత్యధికశాతం చైనా పరికరాలనే వినియోగిస్తున్నారని పరిశోధనల్లో తేలింది. చివరికి క్షిపణులను ప్రయోగించే వాహనాలు కూడా చైనావే. పాక్ - ఉత్తర కొరియాలు రక్షణ పరిజ్ఞానాన్ని పంచుకుంటున్న నేపథ్యంలో.. ఈ టెక్నాలజీని ఇప్పుడు పాక్‌కు బదిలీ చేయదనే గ్యారెంటీ లేదు.

English summary
President Donald Trump just suggested a policy that would strip consumer goods from the shelves of American stores, jeopardize hundreds of thousands of U.S. jobs and spark a meltdown across the global economy, according to experts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X