వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయన అంతే... చిన్న తప్పుకే చంపేస్తాడు..! నార్త్ కొరియాలో వెలుగుచూసిన మరో దారుణం..

|
Google Oneindia TeluguNews

ఉత్తర కొరియా ఆ పేరు వినగానే గుర్తుకొచ్చేది నియంత పాలన. కిమ్ జోంగ్ ఉన్ అంటేనే నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనమన్న అభిప్రాయం ఉంది. చిన్న తప్పులు చేసిన వారిని కూడా క్రూరంగా శిక్షిస్తారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ట్రంప్‌తో జరిగిన భేటీ విఫలమైనందుకు రాయబారితో పాటు మరో నలుగురి ప్రాణాలు తీసినట్లు నార్త్ కొరియా న్యూస్ పేపర్లలో కథనాలు వెలువడ్డాయి.

అక్కడ బతకాలంటే లంచమివ్వాల్సిందే..!అక్కడ బతకాలంటే లంచమివ్వాల్సిందే..!

రాయబారి కాల్చివేత

రాయబారి కాల్చివేత

ఈ ఏడిదా ఫిబ్రవరిలో హనోయి వేదికగా అమెరికా - నార్త్ కొరియా రెండో సమ్మిట్ జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి యూఎస్‌లో నార్త్ కొరియా రాయబారి కిమ్ హ్యాక్ చోల్ అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. కిమ్‌తో పాటు ప్రైవేటు ట్రైన్‌లో ఆయన కూడా ప్రయాణించారు. అయితే భేటీ విషయంలో కిమ్ హ్యాక్ చోల్ నమ్మకద్రోహానికి పాల్పడ్డారన్న కారణంతో కిమ్ జాంగ్ ఉన్ ఆయనకు శిక్ష విధించారు. నార్త కొరియా అధినేత ఆదేశాల మేరకు ఫైరింగ్ స్క్వాడ్ కిమ్ హ్యాక్ చోల్‌ను కాల్చిచంపినట్లు తెలుస్తోంది.

మరో నలుగురు అధికారులు

మరో నలుగురు అధికారులు

ఈ ఏడాది మార్చిలో ఫైరింగ్ స్క్వాడ్ హ్యాక్ చోల్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో నలుగురు అధికారులను సైతం మియామీ ఎయిర్‌పోర్టులో కిమ్ హత్య చేయించినట్లు సమాచారం. అయితే వారెవరన్న విషయం ఇంకా తెలియలేదు. నలుగురు అధికారుల మరణ శిక్షకు సంబంధించి వచ్చిన వార్తా కథనాలపై స్పందించేందుకు నార్త్ కొరియా ప్రభుత్వం నిరాకరించింది.

తప్పుడు అనువాదం చేసినందుకు జైలు శిక్ష

తప్పుడు అనువాదం చేసినందుకు జైలు శిక్ష

ఇదిలా ఉంటే ట్రంప్, కిమ్ భేటీకి ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన షిన్ హయ్ యాంగ్ అనే మహిళను కిమ్ జైలుకు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. సమావేశంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణను అనువదించడంలో ఆమె పొరపాటు చేసినందున శిక్ష విధించినట్లు తెలుస్తోంది. చర్చలు విఫమైనట్లు ట్రంప్ ప్రకటించిన తర్వాత ఆయన చేసిన ప్రతిపాదనను షిన్ సరిగా వివరించకలేక పోయిందనందునే జైలుకు పంపినట్లు సమాచారం.

English summary
North Korea executed its special envoy to the United States following the collapse of the second summit between leader Kim Jong Un and President Donald Trump, a South Korean newspaper reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X