• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసామన్యం: ఉ.కొరియా ఎంతలా ఎదిగిందంటే?, రహస్య డాక్యుమెంట్లలోనే అదే..

|

వాషింగ్టన్: చిన్న దేశమే అయినప్పటికీ.. అగ్ర రాజ్యానికి సవాల్ విసిరేంత ధైర్యం ఉత్తరకొరియాకు ఎక్కడిది? అన్న అనుమానం ఇక అక్కర్లేదు. చైనా సహాయమో, రష్యా పుణ్యమో.. మొత్తానికి సొంతంగా క్షిపణి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే స్థాయికి ఆ దేశం ఎదిగిందని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతూనే ఉన్నాయి.

ఉ.కొరియా వెనుక ఆ దేశం: అమెరికాకు ఊహించని షాక్?, ద్వంద్య నీతికి పరాకాష్ఠ!

తాజాగా మరో ఆసక్తికర విషయం కూడా వెలుగుచూసింది. రాకెట్ ఇంధనాన్ని కూడా ఉత్తరకొరియా స్వయంగా తయారుచేసుకుంటోందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. గతంలో రాకెట్ ఇంధనం కోసం రష్యా, చైనాలపై ఆధారపడ్డ కొరియా.. ఇప్పుడు స్వయంగా తయారు చేసుకునే స్థాయికి ఎదిగిందని చెప్పుకొచ్చింది.

రష్యన్ కంపెనీతో డీల్: 'కిమ్' రూట్ మార్చాడా?, ప్రపంచానికి సైబర్ ముప్పు!..

యూడీఎంహెచ్‌ ఇంధనం:

యూడీఎంహెచ్‌ ఇంధనం:

క్షిపణులు, రాకెట్లను ప్రయోగించడానికి ఉపయోగించే ఇంధనమే అన్‌సిమిట్రికల్‌ డైమిథైల్‌ హైడ్రజైన్‌ (యూడీఎంహెచ్‌). ఉత్తరకొరియాపై ఐరాస ఆంక్షలకు ముందు రష్యా, చైనా గుట్టు చప్పుడు కాకుండా ఆ దేశానికి రాకెట్ ఇంధనం సరఫరా చేశాయి. అయితే తమ దేశంపై ఆంక్షలను ముందే ఊహించిన ఉత్తరకొరియా.. తామే స్వయంగా ఇంధనాన్ని తయారుచేసుకునే స్థాయికి ఎదిగిందని

 రష్యా, చైనా ఇంకా ఆ పని చేస్తున్నాయా?

రష్యా, చైనా ఇంకా ఆ పని చేస్తున్నాయా?

ఇంధనం తయారీకి కావాల్సిన ముడి సరుకును రష్యా, చైనా సరఫరా చేస్తున్నాయా? అన్న అనుమానాలను అమెరికా లేవనెత్తుతోంది. ఉ.కొరియాతో సంబంధాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. పాత మిత్రుత్వం రీత్యా.. ఈ రెండు దేశాలు లోపాయకారీగా సహకరిస్తున్నాయా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఈ విషయాన్ని నిర్దారించుకోవడానికి అమెరికా చాలానే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ చైనా, రష్యా ఆ పనికి పూనుకోవడం నిజమే అయితే ముడి పదార్థాల సరఫరాను ఆంక్షల ద్వారా ఆపడమా?.. విద్రోహ చర్యల ద్వారా దెబ్బతీయడమా? అన్న ఆలోచనలో అమెరికా భద్రతా సంస్థలు ఉన్నాయి.

 అప్పటి రహస్య డాక్యుమెంట్లలో:

అప్పటి రహస్య డాక్యుమెంట్లలో:

అణ్వాయుధాలను తయారుచేసుకోవడంలో ఉత్తరకొరియా రోజురోజుకు అభివృద్ది సాధిస్తోందని అమెరికా విశ్వసిస్తోంది. ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నా.. అమెరికా మాత్రం తమ మాటల్ని పట్టించుకోలేదని అక్కడి గూఢచార సంస్థలు చెబుతున్నాయి.

కాగా, అమెరికా భూభాగంలో ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసి ధ్వంసం చేసేంత శక్తి ఉత్తరకొరియాకు ఉందని ఒకప్పటి రహస్య డాక్యుమెంట్లలో పేర్కొనడం గమనార్హం. జార్జి డబ్ల్యూ బుష్ హయాం నాటి రహస్య డాక్యుమెంట్లలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

అమెరికా భూభాగాన్ని ధ్వంసం చేసే క్షిపణులకు కావాల్సిన ఇంధనాన్ని ఉత్తరకొరియా సొంతంగా తయారు చేసుకుంటోందని కూడా అందులో పేర్కొన్నారు. ఉత్తరకొరియా ఇంత వేగంగా తన అణు సామర్థ్యాన్ని పెంచుకోవడంతో అమెరికా భయం రెట్టింపయ్యింది.

 ఈపాటికే మొదలుపెట్టింది?

ఈపాటికే మొదలుపెట్టింది?

రష్యా, చైనాల నుంచి ఇంధన సరఫరా నిలిచిపోయినంత మాత్రానా.. ఉ.కొరియా క్షిపణుల విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదని అంతర్జాతీయ సమాజం అభిప్రాయపడుతోంది.

ఈ పరిస్థితిని ముందే ఊహించి ఉత్తరకొరియా ఇప్పటికే ఇంధన తయారీని నేర్చుకుని ఉంటుందని నమ్ముతున్నట్లు యూడీఎంహెచ్‌ వంటి ఇంధనాలపై పుస్తకం రాసిన ఇక్‌హార్ట్‌ ష్మిడ్‌ చెప్పారు. ఇక ఉత్తరకొరియా ఈపాటికే యూడీఎంహెచ్‌ ఉత్పత్తిచేయడం ప్రారంభించిందని అనుకోవచ్చని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ ప్రతినిధి టిమోతీ బారెట్‌ పేర్కొన్నారు.

అయితే యూడీఎంహెచ్‌ ఇంధనాన్ని పూర్తిగా సొంతంగా ఉత్పత్తి చేసే స్థితికి చేరే క్రమంలో ఎంతోమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అమెరికా విదేశాంగశాఖ మాజీ అధికారి వాన్‌ డీపెన్‌ అన్నారు.

పలు యూరప్‌ దేశాలు

పలు యూరప్‌ దేశాలు

చైనా, పలు యూరప్‌ దేశాలు ఇప్పటికీ యూడీఎంహెచ్‌ తయారీని కొనసాగిస్తుండగా.. అమెరికా మాత్రం 1966లొనే దానికి ఫుల్ స్టాప్ పెట్టింది. దానికి బదులు మరింత మెరుగైన సామర్థ్యం కలిగిన ఘన ప్రొపెలంట్ ఇంధనాన్ని అమెరికా అభివృద్ది చేసుకుంది.

కాగా, తేలికగా మండుతూ వేగంగా ఆవిరైపోయే యూడీఎంహెచ్‌ ఎంతో ప్రమాదకరమైనది. యూడీఎంహెచ్‌తో ఎగిరే క్షిపణుల ప్రయోగ సమయంలో ఎందరో కార్మికులు గతంలో మృత్యువాత పడ్డారు. రష్యాలో యూడీఎంహెచ్‌ను 'దెయ్యం విషం' అని కూడా పిలుస్తుంటారు.

English summary
When North Korea launched long-range missiles this summer, and again on Friday, demonstrating its ability to strike Guam and perhaps the US mainland, it powered the weapons with a rare, potent rocket fuel that US intelligence agencies believe initially came from China and Russia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more