వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా-చైనా ఉసిగొల్పుతున్నాయా?: ఉ.కొరియా సీక్రెట్ జలాంతర్గామి, పాక్‌పై సుష్మా డౌట్!

మరోవైపు జల అంతర్గామిలను కూడా రహస్యంగా అభివృద్ధి చేసే పనిలో నిమగ్నం అయ్యారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

North Korea developing nuclear-capable Submarinesకొరియా సీక్రెట్ జలాంతర్గామి,పాక్‌పై డౌట్!|Oneindia

ప్యోంగ్‌యాంగ్: యుద్దంతో ఎప్పుడు విరుచుకుపడుతాడో తెలియని రీతిలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. రహస్య వ్యూహ రచనలు చేస్తూనే ఉన్నారు. ఓవైపు క్షిపణి ప్రయోగాలు, హైడ్రోజన్ బాంబులతో వణికిస్తూనే.. మరోవైపు జల అంతర్గామిలను కూడా రహస్యంగా అభివృద్ధి చేసే పనిలో నిమగ్నం అయ్యారు.

తాజాగా జపాన్ పత్రిక సెకాయ్ నిప్పో దీనిపై ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. తొలి నుంచి అనుమానిస్తున్నట్లే చైనా-రష్యా దేశాలు ఉత్తరకొరియాకు సహకారం అందిస్తున్నాయని జపాన్ తెలిపింది. ఈ రెండు దేశాలకు చెందిన నిపుణుల సహాయంతో కొరియాలోని నాంపో నావెల్‌ షిప్‌యార్డులో అణుజలాంతర్గామిని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొంది.

చమురు అవసరం లేదు:

చమురు అవసరం లేదు:

అణు జలాంతర్గామిని అభివృద్ధి చేయడమంటే మాటలు కాదని, అత్యంత కష్టం, ఖర్చుతో కూడుకున్న పని అని, కానీ ఉత్తరకొరియా మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండానే సునాయసంగా దాన్ని తయారుచేసుకోగలుగుతోందని తెలిపింది.

అమెరికాకు తీసిపోని రీతిలో:

అమెరికాకు తీసిపోని రీతిలో:

అత్యంత శక్తివంతమైన అణుజలంతర్గామిని అత్యంత వేగంగా రూపొందిస్తోందని పేర్కొంది. చమురు అవసరం కూడా లేకుండానే ఎక్కువ కాలం నీటిలో ఉండగలిగేలా దీన్ని రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అమెరికాపై కక్షతో రగిలిపోతున్న ఉత్తరకొరియా.. దాని మిత్ర దేశాలపై సైతం కక్ష కట్టింది.

యుద్దంతోనే తమ సత్తా ఏంటో చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో అమెరికాకు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్యవహరించాలని ఉత్తరకొరియా భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు జలఅంతర్గామిని రూపొందించుకుంటోంది.

చైనా-రష్యా ఇంతేనా?:

చైనా-రష్యా ఇంతేనా?:

యుద్ద పిపాసి కిమ్ జాంగ్ విషయంలో చైనా, రష్యాలు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సహేతుకంగా లేదు. మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే పరిస్థితులను సృష్టిస్తున్న కిమ్‌కు సహాయం అందించడం వెనుక ఆ దేశాల వైఖరేంటో అర్థం కావడం లేదు. అమెరికా తమ శత్రువు అన్న కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్పితే.. యుద్దం వల్ల జరిగే పరిణామాలను ఈ రెండు దేశాలు అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఉత్తరకొరియాను అమెరికా మీదకు ఉసిగొల్పడం ద్వారా ఆ దేశాన్ని విచ్చిన్నం చేయాలనే కోరిక రష్యా, చైనాల్లో మరింత బలపడినట్లు తెలుస్తోంది.

పాక్ కూడా సహాయం:

పాక్ కూడా సహాయం:

రష్యా, చైనాలతో పాటు ఉత్తరకొరియాకు పాకిస్తాన్ కూడా సహాయం అందిస్తుందన్న అనుమానాలను భారత్ వెలిబుచ్చుతోంది. ఈ విషయంలో భారత్ పరోక్షంగా తన అభిప్రాయాలను వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. యూఎస్, జపాన్ దేశాల విదేశాంగ విభాగాల నేతలతో న్యూయార్క్ లో జరిగిన సమావేశంలో భాగంగా.. కేంద్ర విదేశాంగ శాఖ సుష్మా స్వరాజ్ పాక్ పై అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఉత్తరకొరియా తీరును ఆమె తప్పుపట్టిన సుష్మా.. ఆ దేశం పై చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.ఉత్తరకొరియా ప్రయోగాలకు పాకిస్తాన్ సహకారం ఉందని సమావేశంలో సుష్మ పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

English summary
Japanese media has claimed that King-Jong-un led North Korea is secretly developing nuclear-capable submarines. The outlets say that the information came from an anonymous but reliable source. The war-machine will be fully operational by 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X