వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాక్: చైనాకు షాకిస్తున్న కిమ్, మళ్ళీ అణుపరీక్షలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

టోక్యో: ఐక్యరాజ్యసమితిలో అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం తర్వాత ఉత్తరకొరియా మరిన్ని అణుపరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని నిపుణులు అనుమానిస్తున్నారు.ఇదిలా ఉంటే అమెరికా ఉత్తరకొరియాను నాశనం చేయనుంది రష్యా అభిప్రాయపడింది.

కిమ్‌కు ట్రంప్ షాక్: ఉ.కొరియాపై యుద్దానికి అమెరికా రె'ఢీ'కిమ్‌కు ట్రంప్ షాక్: ఉ.కొరియాపై యుద్దానికి అమెరికా రె'ఢీ'

కొన్ని రోజులుగా ఉత్తరకొరియా అధ్యక్షుడు అనుసరిస్తున్న వైఖరి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచదేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి చేసిన హెచ్చరికలను కూడ పట్టించుకోకుండా కొరియా అణుపరీక్షలు నిర్వహిస్తోంది.

టెన్షన్: నవంబర్‌లో ద.కొరియాకు ట్రంప్ , కిమ్‌కు 50 కి.మీ. దూరమేటెన్షన్: నవంబర్‌లో ద.కొరియాకు ట్రంప్ , కిమ్‌కు 50 కి.మీ. దూరమే

ఈ అణుపరీక్షలు నిర్వహించకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉత్తరకొరియాపై తీవ్రమైన ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలను కూడ బేఖాతర్ చేస్తూ ఉత్తరకొరియా అణుపరీక్షలను నిర్వహిస్తోంది.

ట్విస్ట్: కిమ్ వెనుక ఆ రెండు దేశాలు, కట్టడి చేయాలి: అమెరికాట్విస్ట్: కిమ్ వెనుక ఆ రెండు దేశాలు, కట్టడి చేయాలి: అమెరికా

ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ చేసిన ప్రసంగం తర్వాత మరిన్ని అణుపరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తరకొరియాను అమెరికా నాశనం చేయనుంది

ఉత్తరకొరియాను అమెరికా నాశనం చేయనుంది

ఉత్తరకొరియాను నిస్సందేహంగా అమెరికా నాశనం చేస్తుందని రష్యా అనుమానాన్ని వ్యక్తం చేసింది. అమెరికా చేసిన వ్యాఖ్యలపై తమకెలాంటి అనుమానమూ లేదని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి ప్రసంగం ఆధారంగా రష్యా ఈ అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రపంచానికి ప్రమాదకరంగా తయారైన ఉ.కొరియాను సర్వనాశనం చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. దీనిపై రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గె లావరోవ్‌ స్పందించారు.
‘ఉత్తర కొరియాపై పలుమార్లు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను మేము విన్నాం. ఆ దేశాన్ని నాశనం చేయగల సామర్థ్యం అమెరికాకు ఉంది. అందులో మాకు ఎటువంటి అనుమానం లేదు.' అని లావ్‌రోవ్‌ స్పష్టం చేశారు. పరస్పర సహకారంతోనే అన్ని దేశాలు పనిచేయాలని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రశంసించారు.

చైనాకు కష్టాలు

చైనాకు కష్టాలు

చైనాకు సరిహద్దులోనే ఉత్తరకొరియా ఉంది. అయితే ఉత్తరకొరియా అనుసరిస్తున్న విధానాల కారణంగా చైనా ప్రజలు కూడ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉత్తరకొరియాకు సరిహద్దులో ఉన్న చైనా ప్రజలు తమ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా ఉత్తరకొరియా చేస్తోంది.

 భయాందోళనల్లో చైనీయులు

భయాందోళనల్లో చైనీయులు

ఉత్తరకొరియాతో సరిహద్దు పంచుకుంటున్న ఈశాన్య చైనాలోని మూడు ప్రావిన్సుల ప్రజలకు అణుపరీక్షలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైడ్రోజన్ బాంబుని పరీక్షించడంతో మరింత హడలిపోయారు. వెంటనే తమ నిరసనను బహిరంగంగా తెలియజేశారు. ఉత్తరకొరియా అణుపరీక్షలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

 అణు ధార్మికత పెరుగుతోంది

అణు ధార్మికత పెరుగుతోంది

ఉత్తరకొరియా అణుపరీక్షలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ భయానక పరిస్థితిపై ఆ ప్రాంతానికి చెందిన ఉద్యమకారుడు యు యెన్‌‌ఫెంగ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రోజన్ బాంబుని పరీక్షించిన అనంతరం 5.8 తీవ్రత భూకంపం వచ్చిందని తెలిపారు. దేశాల సరిహద్దుల్లో అణు పరీక్షలు నిర్వహించకూడదని, ఉత్తరకొరియా ఈ నిబంధనను పాటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల వల్ల వెలువడే రేడియో యాక్టివిటీ ఈ ప్రాంతంలో పెరుగుతోందన్నారు. ఈ పరిస్థితుల వల్ల సరిహద్దు ప్రాంతంలోని అనేకమంది ప్రజలు వలస వెళ్తున్నారని యెన్‌‌ఫెంగ్ తెలిపారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ చైనా సరిహద్దు ప్రాంతాలను స్మశానంగా మార్చేలా ఉన్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికాపై పగతో పక్కనున్న చైనా ప్రజలకు చెమటలు పట్టిస్తున్నారని ప్రభావిత ప్రజలు వాపోతున్నారు.

English summary
Kim Jong Un’s regime tells the North Korean people every day that the United States wants to destroy them and their country. Now, they will hear it from another source: the president of the United States himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X