వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియా: చైనా, రష్యా ఒత్తిడి చేస్తే సరే.. లేదంటే అమెరికా దిగుతుంది, మేం తోడుంటాం: జపాన్

ఉత్తరకొరియా ఆట కట్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైందని జపాన్ ప్రధాని షింజో అబె వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను ఆపని పక్షంలో దా

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఎవరెన్ని చెప్పినా ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగాలు, క్షిపణి పరీక్షలను మాత్రం ఆపడం లేదు. అమెరికా హూంకరించినా, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినా.. ఆ దేశం మాత్రం తన పని తాను చేసుకుపోతూనే ఉంది.

ఐక్యరాజ్య సమితి తాజాగా కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలోనైనా ఉత్తరకొరియా వెనక్కి తగ్గుతుందని అందరూ భావించారు. వెనక్కి తగ్గక పోగా, ఎలాంటి హెచ్చరికలు చేయకుండా జపాన్ మీదుగా రెండోసారి అది క్షిపణిని ప్రయోగించి విస్మయపరిచింది.

ఉత్తరకొరియా ప్రపంచ ముప్పే...

ఉత్తరకొరియా ప్రపంచ ముప్పే...

ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు, అణ్వస్త్ర ప్రయోగాలు ‘ప్రపంచ ముప్పు'గా జపాన్ ప్రధాని షింజో అబె అభివర్ణించారు. 'ఉత్తరకొరియా రెండు బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలు చేపట్టింది. అవి రెండు మా దేశం గుండా వెళ్లాయి. ఆ సమయంలో మా దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు..' అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ద్వారా ఉత్తరకొరియా ఉద్రిక్తలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఉత్తరకొరియా ప్రపంచ ముప్పుగా మారకముందే ఆ దేశాన్ని నిలువారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెబుతున్నారు.

ఎన్ని ఆంక్షలు విధించినా...

ఎన్ని ఆంక్షలు విధించినా...

ఉత్తరకొరియా టెక్స్‌టైల్ ఎగుమతులపై ఐక్యరాజ్యసమితి తజాగా అంక్షలు విధించడాన్ని జపాన్ స్వాగతిస్తోందని ఆ దేశ ప్రధాని షింజో అబె అన్నారు. సోమవారం అబే అమెరికా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను మీడియాకు తెలిపారు. ఎన్ని రకాల అంక్షలు విధించిన ఉత్తరకొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను ఆపకపోవడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

చైనా, రష్యాలు కఠినంగా వ్యవహరించాలి...

చైనా, రష్యాలు కఠినంగా వ్యవహరించాలి...


ఉత్తరకొరియా దుందుడుకు చర్యలకు ఫుల్ స్టాప్ పడాలంటే దాని మిత్ర దేశాలైన చైనా, రష్యాలు కఠిన వైఖరి అవలంభించాలని జపాన్ ప్రధాని షింజో అబె అభిప్రాయపడ్డారు. కారణాలు ఏవైనా.. ఆ రెండు దేశాలు ఉత్తరకొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ పై ఒత్తిడి తీసుకొస్తే ఫలితం మరోలా ఉండేదని, ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి ఉండేవి కావని, కానీ చైనా, రష్యాలు అలా చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా సైనిక చర్యకు దిగాల్సిందే...

అమెరికా సైనిక చర్యకు దిగాల్సిందే...

ఉత్తరకొరియా ఆట కట్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైందని జపాన్ ప్రధాని షింజో అబె వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను ఆపని పక్షంలో దానిపై సైనిక చర్యకు దిగాలని అబే అమెరికా అధ్యక్షుడికి సూచిస్తున్నారు.

మీరు దిగండి.. మేం తోడొస్తాం...

మీరు దిగండి.. మేం తోడొస్తాం...

ఉత్తరకొరియా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో చేసిన ప్రకటనను జపాన్ ప్రధాని షింజో అబె గుర్తు చేశారు. అన్ని ఆప్షన్లు తన టేబుల్ పై రెడీగా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యనించడాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక నిరీక్షణ అవసరం లేదని, దాని వల్ల ప్రయోజనం కూడా ఉండదని చెప్పారు. అమెరికా సైనిక దాడికి దిగాల్సిన సమయం వచ్చిందన్నారు. ఒకవేళ ఉత్తరకొరియాపై సైనిక దాడికి అమెరికా దిగితే.. అన్ని విధాలుగా అమెరికాకు సహకరించేందుకు జపాన్ సిద్ధంగా ఉందన్నారు. గతంలో కూడా తమ దేశం అమెరికాకు ఈ విషయాన్ని స్పష్టం చేసిన విషయాన్ని అబే గుర్తుచేసుకున్నారు.

English summary
Japan has responded by reaffirming the ironclad Japan-United States alliance, and Japan has coordinated in lock step with the United States and South Korea. I firmly support the United States position that all options are on the table, says Japan Prime Minister Shinzo Abe. While talking to American Media Abe told that as a response to the latest nuclear test, I value the swift and unanimous adoption of Security Council Resolution 2375 on Sept. 11, But we must make North Korea end its provocations, abandon its nuclear and ballistic missile development, and return the abductees in North Korea to their homes.Solidarity and concerted effort among the international community, together with the effective role of the United Nations, are more vital than ever.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X