వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియా నియంతకు మరో కీలక పదవి: చెల్లెలిని కూడా కాదని: ఆయనకు తప్ప మరొకరికి నో ఛాన్స్

|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్.. మరో కీలక పదవిని అందుకున్నారు. అధికార వర్కర్స్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కొనసాగుతోన్న వర్కర్స్ పార్టీ ఎనిమిదవ జాతీయ మహాసభ సందర్భంగా అగ్ర నాయకత్వం ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ ఆరో రోజు సమావేశాల్లో కిమ్‌జొంగ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ తీర్మానాన్ని ఆమోదించినట్లు ఉత్తర కొరియా అధికార మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) వెల్లడించింది.

ఈ జాతీయ కాంగ్రెస్ మహాసభల సందర్భంగా వర్కర్స్ పార్టీలో కొన్ని కీలక మార్పులు, చేర్పులు చేశారు. పార్టీ అంతర్గతంగా కొనసాగుతూ వచ్చిన సెక్రెటేరియట్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించారు. 2016 నాటి జాతీయ మహాసభల సందర్భంగా ఈ వ్యవస్థను తొలగించారు. ఈ అయిదేళ్ల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని..మళ్లీ సెక్రెటేరియట్ సిస్టమ్‌ను పునరుద్ధరించాలని వర్కర్స్ పార్టీ అగ్ర నాయకులు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా తీర్మానాన్ని ఆమోదించారు.

North Korea: Kim Jong-Un Elected as General Secretary of ruling Workers’ Party

ఇప్పటిదాకా వర్కర్స్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిమ్ జొంగ్ ఉన్ తండ్రి కిమ్ జొంగ్ ఇల్ ఉన్నారు. 2011లో ఆయన మరణించినప్పటికీ.. ఆ ఖాళీని భర్తీ చేయలేదు. కిమ్‌జొంగ్ ఇల్ గౌరవార్థం ఆయన మరణానంతరం కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరినీ నియమించలేదు. అంతకుముందు కిమ్ తాత ఆ పదవిలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. తాజాగా- కిమ్‌జొంగ్ ఉన్‌ను ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తమ దేశాధినేతను ఏక్రగీవంగా ఎన్నుకొన్నట్లు వర్కర్స్ పార్టీ అగ్ర నాయకులు ప్రకటించారు. ఈ మహాసభలకు హాజరైన ప్రతి నాయకుడు కూడా కిమ్ నియామకాన్ని సమర్థించారని తెలిపారు.

నిజానికి- వర్కర్స్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిమ్ సోదరి కిమ్ యో జొంగ్ నియమితులవుతారంటూ మొదట్లో వార్తలు వెలువడ్డాయి. దేశాధినేతగా కిమ్ తీరిక లేని కార్యక్రమాల్లో గడపాల్సి ఉంటున్నందున.. ఆయన చెల్లెలిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి అవకాశం ఉందంటూ ఉత్తర కొరియా మీడియా అంచనా వేసింది. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. యో జొంగ్‌కు బదులుగా కిమ్‌నే ఆ స్థానానికి ఎన్నుకున్నారు. ఇదివరకు ఆమె వర్కర్స్ పార్టీ పొలిట్‌బ్యురో సభ్యురాలిగా పనిచేశారు.

English summary
North Korean leader Kim Jong Un on Monday took over a new title of the general secretary of the ruling Workers’ Party, said state media KCNA. The election for the position that was formerly held by Kim’s late father and grandfather took place on Sunday during the party’s ongoing multi-year congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X