వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికావి పగటికలలే! అది సైనికచర్యే, అణ్వాయుధాలు వదిలే ప్రసక్తే లేదు: ఉత్తరకొరియా

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సియోల్‌: తాము అణ్వాయుధాలను వదిలేస్తామని అగ్రరాజ్యం అమెరికా పగటి కలలుకంటోందని ఉత్తరకొరియా చురకలు అంటించింది. సర్వశక్తులను ఒడ్డి తయారు చేసిన అణ్వాయుధాలను వదిలే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేసింది.

అమెరికా మటాషే! అణుదాడికంటే ప్రమాదకరమైన టెక్నాలజీని ప్రయోగించబోతోన్న ఉత్తరకొరియా!?అమెరికా మటాషే! అణుదాడికంటే ప్రమాదకరమైన టెక్నాలజీని ప్రయోగించబోతోన్న ఉత్తరకొరియా!?

చైనా దురాగతం: ప్రజాస్వామ్యం కావాలన్నందుకు.. పది వేల మందిని చంపేశారు!చైనా దురాగతం: ప్రజాస్వామ్యం కావాలన్నందుకు.. పది వేల మందిని చంపేశారు!

వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ఉత్తరకొరియా నిద్రలేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాపై తాజాగా ఉత్తరకొరియా తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది.

North Korea: Latest UN Sanctions an ‘Act of War’

తమపై ఐరాస కఠిన ఆంక్షలు విధించడం ఒక రకంగా సైనికచర్యకు దిగినట్లేనని అని ఉత్తరకొరియా ఆరోపించింది. ఇలాంటి చర్యలకు అమెరికా పాల్పడటం తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది.

తాము ఇటీవల పరీక్షించిన సరికొత్త బాలిస్టిక్‌ క్షిపణి అమెరికాలోని ఏ ప్రాంతానికయినా సులభంగా చేరుకోగలదని ప్యాంగ్యాంగ్‌ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలకు ఐరాస భద్రతామండలి సైతం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
'అమెరికా దాని అనుచర దేశాలు ఆ తీర్మానాన్ని తీసుకొచ్చారని మేము భావిస్తున్నాం. ఇది మా దేశ ప్రజల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి సమాధి చేయడమే. ఆంక్షలు విధించడం ద్వారా కొరియా ద్వీపకల్పంలో శాంతికి విఘాతం కలిగించడమే అవుతుంది..' అని ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది.

అమెరికా క్షేమంగా ఉండాలనుకుంటే ఉత్తర కొరియా పట్ల ఉన్న తన విరుద్ధ విధానాలకు రద్దు చేసుకోవాలని హితవు పలికింది. సర్వశక్తులను ఒడ్డి తయారు చేసుకున్న అణ్వాయుధాలను తామెలా వదిలేస్తామని ఉత్తరకొరియా ప్రశ్నించింది.

English summary
North Korea’s foreign ministry is calling the latest United Nations sanctions an “act of war” and “tantamount to a complete economic blockade.”In a statement carried by the North Korean state news agency, KCNA, the ministry’s spokesman says Pyongyang “categorically rejects the resolution”. The U.N. Security Council unanimously agreed Friday to impose another round of sanctions on North Korea, targeting sectors that fuel its illicit weapons programs. Sunday’s statement from North Korea challenged that assertion, saying “If the U.S. wishes to live safely, it must abandon its hostile policy ... and learn to co-exist with the country that has nuclear weapons.” It also said that the countries that supported the sanctions resolution would “be held completely responsible for all the consequences,” and that Pyongyang would make sure “for ever and ever that they pay (a) heavy price.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X