వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుక్కలు చూపిస్తున్న కిమ్: మళ్లీ క్షిపణి ప్రయోగం; 'సద్దాం, గడాఫీలా చరిత్ర గుర్తుందా?'

|
Google Oneindia TeluguNews

Recommended Video

North Korea Vs Japan చుక్కలు చూపిస్తున్న కిమ్ జపాన్ పై మళ్లీ క్షిపణి ప్రయోగం | Oneindia Telugu

టోక్యో/ప్యోంగ్‌యాంగ్: అదే తీరు.. అదే దుందుడుకు వైఖరి.. పంథా మారుతుందన్న నమ్మకం కూడా లేదు. ఉత్తరకొరియా వైఖరితో రోజురోజుకు ఆ దేశంపై ప్రపంచ దేశాలకు సహనం నశిస్తోంది. మాటలతోను, చర్చలతోనో ఆ దేశాన్ని దారికి తీసుకురాగలగడం కష్టమేనన్న అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

ఇదీ అసలు నిజం: కిమ్ యుద్ద కాంక్షపై బీబీసీ, 15ని.ల్లో చంపేందుకు ద.కొరియా ప్లాన్..ఇదీ అసలు నిజం: కిమ్ యుద్ద కాంక్షపై బీబీసీ, 15ని.ల్లో చంపేందుకు ద.కొరియా ప్లాన్..

అగ్రరాజ్యం అమెరికాను టార్గెట్ చేస్తూ ఉత్తరకొరియా చేస్తున్న దుస్సాహాసాలకు ఇప్పటికీ తెరపడలేదు. సరికదా.. అమెరికాకు సహకరిస్తున్నందుకు దక్షిణ కొరియా, జపాన్ లపై కూడా ఆ దేశం కక్ష కట్టింది. తాజాగా జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించి తన వైఖరిని మరోసారి చాటుకుంది. ఇప్పటికే 11సార్లు క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తరకొరియా.. మున్ముందు ఆ సంఖ్యను పెంచేందుకే మొగ్గుచూపుతోంది.

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

జపాన్‌ను భయపెట్టడానికి:

జపాన్‌ను భయపెట్టడానికి:

అమెరికాకు సహకరిస్తున్నందుకు జపాన్‌ను టార్గెట్ చేసిన ఉత్తరకొరియా.. అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. ప్యోంగ్ యాంగ్ విమానశ్రయం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. జపాన్ ప్రధాని షింజో అబే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇక ఉత్తరకొరియా కవ్వింపు చర్యలను ఏమాత్రం సహించేది లేదని ధీటుగా బదులిచ్చారు.

ద.కొరియా, అమెరికా అలర్ట్:

ద.కొరియా, అమెరికా అలర్ట్:

అన్నంత పని చేసే దిశగానే ఉత్తరకొరియా దుస్సాహాసానికి ఒడిగడుతుండటంతో దక్షిణకొరియా, అమెరికాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరకొరియా వైఖరిపై అవలంభించాల్సిన విధానాలపై దక్షిణకొరియా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి సుమారు 770కి.మీ ఎత్తులో 3700కి.మీ ప్రయాణించి సముద్రంలో పడిపోయినట్లు దక్షిణ కొరియా భద్రతా దళాల చీఫ్ తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉత్తరకొరియా చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షిస్తున్నారు.

సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే:

సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే:

అమెరికాను ఎదుర్కొంటున్నానని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ భావించడం ఒక భ్రమ అని ఆ దేశం తెలిపింది. గతంలో తమతో పెట్టుకున్న సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే కిమ్ జాంగ్ కు పడుతుందని హెచ్చరించింది. ఒక్క హైడ్రోజన్ బాంబు ప్రయోగానికే ఏదో సాధించామనే భ్రమలో ఉత్తరకొరియా ఉందని, అమెరికా వద్ద ఉన్న హైడ్రోజన్ బాంబులతో పోలిస్తే ఆ దేశం లెక్కలోకే రాదని మండిపడింది.

అది గుర్తుంచుకోండి:

అది గుర్తుంచుకోండి:

అపారమైన తెలివివేటలతో పాటు అత్యాధునిక టెక్నాలజీతోనే తమ దేశం పురోగతి సాధించిందన్న విషయాన్ని గుర్తెరగాలని ఉత్తరకొరియాకు అమెరికా సూచించింది. ఆ విషయంలో తమ దేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయని, అలా కాకుండా అమెరికాపై దాడులకు దిగుతామని భావిస్తే కిమ్ జాంగ్ సాధించేదేమి ఉండదని హితవు పలికింది.

ఉత్తరకొరియా-దక్షిణకొరియాల మధ్య జరిగిన యుద్దాన్ని ప్రాతిపదికగా తీసుకుని అమెరికా మీద కిమ్ కక్ష కట్టారని ఆ దేశం పేర్కొంది. అందుకే వరుస క్షిపణి ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడింది.

English summary
South Korea — North Korea fired another ballistic missile over Japan on Friday, a direct challenge to the United States and China just days after a new sanctions resolution adopted by the United Nations Security Council that was intended to force the country to halt its accelerating nuclear and missile tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X