• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తర కొరియా: 'అణుబాంబులు వేయగల అత్యాధునిక క్షిపణులను ప్రయోగించాం' -Newsreel

By BBC News తెలుగు
|
ఉత్తర కొరియా

కొత్త తరహా వ్యూహాత్మక క్షిపణులను విజయవంతంగా ప్రయోగించామని ఉత్తర కొరియా గురువారంనాడు ప్రకటించుకుంది.

ఏడాది తర్వాత, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ అధికారంలోకి వచ్చాక ఉత్తర కొరియా ప్రయోగించిన తొలి బాలిస్టిక్‌ క్షిపణి ఇది. అయితే ఈ క్షిపణి ప్రయోగాన్ని అటు జపాన్‌, ఇటు అమెరికా రెండూ ఖండించాయి. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించకూడదు.

"ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, తన ప్రయోగాలతో పొరుగు దేశాలను, ప్రాంతీయ రాజ్యాలను భయపెట్టడమే" అని అమెరికా వ్యాఖ్యానించింది.

దేశపు తూర్పుతీరంలో 600 కి.మీ. దూరంలో ఏర్పాటు చేసిన లక్ష్యాలను తమ రెండు క్షిపణులు ఛేదించాయని ఉత్తర కొరియా ఒక ప్రకటనలో పేర్కొనగా, కేవలం 400 కి.మీ. మాత్రమే మిసైళ్లు ప్రయాణించాయని జపాన్‌ పేర్కొంది.

ఇందులోని క్షిపణి రెండున్నర టన్నుల బరువును మోయగలదని, అణుబాంబును కూడా మోసుకెళ్లగల సామర్ధ్యం ఉందని, తమ దేశ భద్రత విషయంలో ఈ మిసైళ్లు కీలక పాత్ర పోషించబోతున్నాయని ఉత్తరకొరియా తన ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగ కార్యక్రమానికి దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హాజరు కాలేదు.


న్యూజీలాండ్‌: గర్భస్రావం అయితే వేతనంతో కూడిన సెలవు

గర్భస్రావం

ఉద్యోగం చేస్తున్న దంపతులకు గర్భస్రావం, లేదా మృత శిశు జననాలు వంటి సంఘటనలు జరిగినప్పుడు దానిని కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఇచ్చే పెయిడ్‌ లీవ్‌(వేతనంతో కూడిన సెలవు)గా ఇవ్వాలని న్యూజీలాండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒక చట్టాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించింది.

పిల్లలు దత్తత తీసుకున్నవారు, సరోగసీ ద్వారా సంతానాన్ని పొందిన వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ప్రపంచంలో భారత్‌ తర్వాత ఈ తరహా చట్టం చేసిన రెండో దేశంగా న్యూజీలాండ్‌ నిలిచింది.

https://twitter.com/ginnyandersen/status/1374570186041270276

"సిక్‌ లీవ్‌ తీసుకునే అవసరం లేకుండా వారు ఈ బాధ నుంచి కోలుకోవడానికి ఈ సెలవు ఉపయోగపడుతుంది" అని ఈ బిల్లును ప్రవేశపెట్టిన పార్లమెంటు సభ్యురాలు గిన్నీ ఆండర్సన్‌ పేర్కొన్నారు.

పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ బిల్లుతో గర్భస్రావం లేదా మృత శిశు జననం జరిగినప్పుడు వేతనంతో కూడిన మూడు రోజుల సెలవు ఇస్తారు. న్యూజీలాండ్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి ఇలాంటి సమస్య ఎదురవుతోందని, వారు ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఈ సెలవు ఉపయోగపడుతుందని గిన్నీ ఆండర్సన్‌ వ్యాఖ్యానించారు.

గత ఏడాదే న్యూజీలాండ్‌ ప్రభుత్వం అబార్షన్‌ చట్టాన్ని సంస్కరించే ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 20 వారాలలోపు గర్భాన్ని రద్దు చేసుకునే అధికారం మహిళలకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
North Korea launches state-of-the-art nuclear-capable missiles
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X