• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉ.కొరియా నియంత అంకుల్ దారుణహత్య: డొనాల్డ్ ట్రంప్-కిమ్‌‌జొంగ్ జోడీ ప్రమేయం: రేజ్ బుక్

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలో నిల్చున్న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో డొనాల్డ్ ట్రంప్ విఫలం అయ్యారంటూ డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఆరోపణలు చేస్తున్నారు. ట్రంప్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదంటూ స్వయానా ఆయన సోదరి వ్యాఖ్యానించినట్లుగా ఆడియో టేపులు వెలుగులోకి రావడం మరింత ఇరకాటంలో పడేశాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఇబ్బందులను మరింత పెంచేలా చేస్తోంది ఓ బుక్.

ఆరెంజ్ కలర్‌లో ఆకాశం: బిత్తరపోతోన్న జనం: ఇలాంటిది ఎప్పుడూ చూడలేదంటూ:

 రేజ్ పేరుతో జర్నలిస్ట్ రాసిన బుక్..

రేజ్ పేరుతో జర్నలిస్ట్ రాసిన బుక్..

ప్రముఖ జర్నలిస్ట్ బాబ్ వుడ్‌వర్డ్స్ రాసిన పుస్తకం అది. రేజ్ పేరుతో ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రంతో దీన్ని ముద్రించారు. డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కొన్ని కీలక అంశాలను ఇందులో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి- ఈ నాలుగేళ్ల కాలంలో ట్రంప్ అనుసరించిన విదేశాంగ విధానాలు, కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనడానికి తీసుకున్న చర్యలు, చైనాపై అమెరికా ఎలాంటి వైఖరిని ప్రదర్శించిందనే విషయాలపై ఈ పుస్తకంలో బాబ్ వుడ్‌వర్డ్స్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ బుక్.. ట్రంప్‌ను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేదిగా భావిస్తున్నారు.

 2017 హత్యకు గురైన కిమ్ అంకుల్..

2017 హత్యకు గురైన కిమ్ అంకుల్..

అన్నింటికంటే కిమ్‌జొంగ్ ఉన్ మామ దారుణ హత్యకు సంబంధించిన సమాచారం.. సంచలనాన్ని రేపుతోంది. కిమ్‌జొంగ్ ఉన్ మామ కిమ్‌జొంగ్-నామ్ 2017 ఫిబ్రవరి 13వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో హత్యకు గురయ్యారు. ఉత్తర కొరియా ఏజెంట్లే ఆయనను హత్య చేసి ఉంటాయంటూ అప్పట్లో అనుమానాలు వెల్లువెత్తాయి. ఇదే అంశాన్ని బాబ్ వుడ్‌వర్డ్స్ తాను రాసిన రేజ్ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ హత్యలో డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం కూడా ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. 46 సంవత్సరాల కిమ్‌జొంగ్- నామ్ మకావులో నివసిస్తున్నారు. అక్కడికి వెళ్లే ప్రయత్నంలో విమానాశ్రయానికి చేరుకోగా ఈ దాడి చోటు చేసుకుంది.

 ఎలాంటి సహాయమైనా అందించడానికి..

ఎలాంటి సహాయమైనా అందించడానికి..

ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్.. కిమ్‌జొంగ్ ఉన్‌కు లేఖ రాశారని, ఎలాంటి సహాయమైనా అందిస్తానని హామీ ఇచ్చారని బాబ్ వుడ్‌వర్డ్స్ పేర్కొన్నారు. తాను ఇదివరకు ట్రంప్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో కిమ్‌ను ప్రశంసించారని, నామ్ హత్యోదంతంపై కిమ్ సమాచారం ఇచ్చినట్లు ట్రంప్ తన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారని బాబ్ పేర్కొన్నారు. నామ్ హత్యోదంతంలో డొనాల్డ్ ట్రంప్‌ ప్రమేయం ఉన్నట్లు వచ్చిన వార్తలపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ పెద్దగా పట్టించుకోలేదని పుస్తకంలో రాసుకొచ్చారు. ట్రంప్-కిమ్ మధ్య ఈ హత్యకు డీల్ కుదరిందనే సమాచారం ఏదీ తమ వద్ద లేదని వెల్లడించినట్లు తెలిపారు.

10 మంది అరెస్టు..

10 మంది అరెస్టు..

అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారనే ఆరోపణలు కిమ్‌జొంగ్ మీద ఉన్నాయి. తన అధికారానికి అడ్డుగా వస్తారని భావించిన ప్రతి ఒక్కరినీ ఆయన హతమార్చారంటూ ఇప్పటికే పలు వార్తలు వెలువడ్డాయి. కిమ్‌జొంగ్ నామ్‌ను కూడా ఆ కారణంతోనే హత్య చేయించి ఉండారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ హత్యతో సంబంధం ఉందనే అనుమానాలతో పదిమందిని అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉత్తరకొరియాకు చెందిన కొందరు అధికారులు సహా వియత్నాం, ఇండోనేషియాకు చెందిన ముగ్గురు అరెస్టయిన వారిలో ఉన్నారు.

English summary
US President Donald Trump and North Korea leader Kim Jong-un connected over discussions of the gruesome murder of the North Korean Leader's uncle, a new book claims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X