వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ దేశంలో డెడ్ సైలెన్స్.. ఇండియా పొరుగున కలాపాలు.. అంతుచిక్కని జాంగ్ జాడ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కు ధీటుగా ఆయన గురించిన వార్తలు ప్రపంచం నలుమూలలకు వ్యాపించాయి.. ఇది జరిగి గంటలు గడుస్తున్నాయి.. పొరుగు దేశాధినేతలు సైతం ప్రకటనలు చేశారు.. శత్రుదేశాల్లోనైతే ఆయనను చంపి, సమాధి చేసే కార్యక్రమం కూడా పూర్తయింది.. ఇంత జరుగుతున్నా ఉత్తర కొరియా నియంతనేత కిమ్ జాంగ్ ఉన్ జాడ ఇప్పటికీ అంతుచిక్కలేదు.. ఆ దేశ అధికారిక మీడియా, ప్రత్యామ్నాయ గొంతుకలన్నీ డెడ్ సైలెన్స్ పాటిస్తున్నాయి.. ఇది కిమ్ వికృత వినోదమా? లేక నిజంగానే ప్రమాదం తలెత్తిందా? అనే చర్చ జోరందుకుంది..

Recommended Video

North Korea Silent On Kim Jong Un But interested Bangladesh's Juche Study
ఏం జరుగుతోంది..

ఏం జరుగుతోంది..

కరడుగట్టిన కమ్యూనిస్టు దేశంగా చెప్పుకునే ఉత్తర కొరియాలో ప్రభుత్వ ఆధీనంలోని ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ)' రొగోండ్ సిన్మన్ పత్రిక తప్ప ఇతర మీడియా సంస్థలేవీ లేవు. ఎలాంటి విషయాన్నైనా దాని ద్వారానే ప్రకటిస్తారు. గడిచిన కొద్ది గంటలుగా కిమ్ ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా ఎప్పటికప్పుడు పుకార్లను ఖండించే కేసీఎన్ఏ, సిన్మన్.. ఇప్పుడు మాత్రం మౌనాన్ని ఆశ్రయించడంతో ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది.

పట్టు పురుగులు.. ప్రభుత్వ బాండ్లు..

పట్టు పురుగులు.. ప్రభుత్వ బాండ్లు..

బుధవారం నాటి కేసీఎన్ఏ హెడ్ లైన్స్ లో పట్టుపురుగుల పెంపకం, ప్రభుత్వ బాండ్ల విక్రయాలకు సంబంధించిన వార్తలే తప్ప కిమ్ ఆరోగ్యంపై వివరణలుగానీ, ఆయన ఎక్కడున్నారనే సమాచారంగానీ వెల్లడించలేదు. కిమ్ ఆరోగ్యం ప్రమాదకర స్థాయిలో చెడిపోయిందన్న వార్తలను సౌత్ కొరియా ప్రెసిడెంట్ కార్యాలయం, చైనా అధికార వర్గాలు ఖండించాయి. మొదట ఈ వార్తను బ్రేక్ చేసిన ‘డెయిలీ ఎన్‌కే' కూడా సవరణలు ఇచ్చింది. ఇన్ని గంటల తర్వాత కూడా నార్త్ కొరియా చప్పుడు చేయకపోవడంపై సౌత్ కొరియా మళ్లీ స్పందించింది. ‘‘బహుశా, కిమ్ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో లేకపోవచ్చని, ఆయన ఎక్కడున్నదీ వెల్లడించే ఉద్దేశం లేకే అక్కడి మీడియా మౌనం వహిస్తుండొచ్చని సౌత్ కొరియా అధికారులు అభిప్రాయపడ్డారు. గతంలోనూ కిమ్ ఓ నాలుగు వారాలపాటు మాయమై, మళ్లీ సడెన్ గా ఊడిపడిన సందర్భాన్ని వాళ్లు గుర్తుచేశారు. కాగా,

బంగ్లాదేశ్‌లో కొరియా వాయిస్..

బంగ్లాదేశ్‌లో కొరియా వాయిస్..

అణ్వాయుధాలతో అందరినీ భయపెట్టే కిమ్ జాంగ్ ఉన్‌కు అనూహ్యరీతిలో.. భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ లో మద్దతు పెరుగుతున్నది. బంగ్లాలో అధికారిక పార్టీ అయిన బంగ్లాదేశ్ అవామీ లీగ్, వర్కర్స్ పార్టీ ఆధ్వర్యంలో గత వారం ‘జుచె సిద్ధాంతం'పై జాతీయ సెమినార్ జరిగింది. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక మీడియా బుధవారం నాటి ఎడిషన్ లో హైలైట్ గా రాసింది. ఆ కార్యక్రమానికి బంగ్లా మేధావులు, మీడియా ప్రముఖులు కూడా హాజరైనట్లు చెప్పుకుంది. కొరియా అణునిరాయుధీకరణకు బంగ్లాదేశ్ మద్దతు పలకాలని కొంతకాలంగా డిమాండ్ ఊపందుకుంటున్నది.

ఏంటీ జుచె సిద్ధాంతం?

ఏంటీ జుచె సిద్ధాంతం?


ఉత్తర కొరియా తొలితరం నియంతనేత, కిమ్ జాంగ్ తాత అయిన కిమ్‌ ఇల్‌ సంగ్‌ రూపొందించిందే జుచె సిద్ధాంతం. దీని అర్థం స్వయం ఆర్థిక స్వావలంబన. దేశానికి అవసరమైనవన్నీ లోపలే తయారుచేసుకోవాలి, ఇతర దేశాలపై ఆధారపడరాదు అన్నది దాని సారంశం. ఆ సిద్ధాంతం వల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టాలను పక్కన పెడితే, కొన్ని పాయింట్లను స్వీకరించి బంగ్లాదేశ్ సత్ఫలితాల్ని సాధించింది. ఈ విషయాన్ని తమ ఘనతగా ఇప్పుడు ఉత్తరకొరియా ప్రచారం చేసుకుంటున్నది. ఇక కిమ్ విషయానికొస్తే..

ప్రియమైన శత్రువు..

ప్రియమైన శత్రువు..

అమెరికా, సౌత్ కొరియా మీడియాలో వస్తోన్న వార్తల్ని తాను నమ్మబోనని, చాలా వరకు అవి ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తాయని, ఉత్తరకొరియా నేత కిమ్ జాంగ్ సేఫ్ గానే ఉన్నారని నమ్ముతున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అణ్వాయుధాల నిర్వీర్యం విషయంలో ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడం, అంతలోనే అనూహ్యంగా ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకోవడం తెలిసిందే. అణ్వాయుధాల్ని నిర్వీర్యం చేసేవిషయంలో కిమ్ వెనక్కి తగ్గకపోవడంతో ఆ దేశంపై అంతర్జాతీయ ఆంక్షలు యధావిధిగా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ సాయం అందుకునేందుకైనా ఆంక్షలు ఎత్తేయాలని కొరియా అభ్యర్థిస్తోంది.

English summary
North Korean state media on Wednesday made no mention of new appearances by leader Kim Jong Un, amid continued international speculation over his health following reports he underwent surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X