వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధం తప్పదా?: సైనికశక్తిని పెంచుతున్న కిమ్, కొత్తగా 47 లక్షలమంది, ఉ.కొరియాకు చైనా భారీ షాక్

ఉత్తర కొరియాను లేకుండా చేస్తామన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు ఉత్తర కొరియా మరో రకంగా కౌంటర్ ఇస్తోంది.

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్ యాంగ్: ఉత్తర కొరియాను లేకుండా చేస్తామన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు ఉత్తర కొరియా మరో రకంగా కౌంటర్ ఇస్తోంది.

చదవండి: యుద్ధానికి అంతా సిద్ధం, అదే జరిగితే: ట్రంప్, తగ్గని ఉత్తర కొరియా

అమెరికాకు కౌంటర్.. సైన్యంలో చేరేందుకు 47 లక్షల మంది

అమెరికాకు కౌంటర్.. సైన్యంలో చేరేందుకు 47 లక్షల మంది

కొన్నాళ్లుగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుస అణు పరీక్షలతో అమెరికాకు హెచ్చరికలు పంపే ప్రయత్నం చేస్తున్న ఉత్తర కొరియా తాజాగా మరో ప్రకటన చేసింది. సైన్యంలో చేరేందుకు 47 లక్షల మంది స్వతంత్రంగా ముందుకు వస్తున్నారని అమెరికాకు కౌంటర్ ఇస్తోంది.

యుద్ధానికి దారి తీస్తాయని ఆందోళన

యుద్ధానికి దారి తీస్తాయని ఆందోళన

అమెరికాపై కూడా వరుస హెచ్చరికలకు పాల్పడుతూ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు ఉ కొరియా దేశాధ్యక్షులు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. దీంతో అమెరికా కిమ్‌కు దీటుగా బదులిచ్చేందుకు చర్యలు చేపడుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అవి యుద్ధానికి దారి తీస్తాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సైనిక శక్తిని పెంచుకునేందుకు ఉత్తర కొరియా

సైనిక శక్తిని పెంచుకునేందుకు ఉత్తర కొరియా

ఉత్తర కొరియా తమ ఆయుధ సంపత్తిని, సైనికశక్తిని పెంచుకునే పనిలో పడినట్లుగా వార్తలు రావడం కలకలం రేపుతోంది. లక్షల మంది కొత్తగా సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఉత్తర కొరియా అధికారిక మీడియా వర్గాలు గురువారం వెల్లడించడం గమనార్హం.

సైన్యంలో చేరేందుకు విద్యార్థులు, ఉద్యోగులు సై

సైన్యంలో చేరేందుకు విద్యార్థులు, ఉద్యోగులు సై

వీరిలో విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఉన్నట్లు ఉత్తర కొరియా తెలిపింది. గత ఆరు రోజుల్లో 12.2 లక్షల మంది మహిళలు సైన్యంలో చేరుతామని అడిగినట్లు మీడియా వెల్లడించింది.

ఉత్తర కొరియాకు చైనా మరో షాక్

ఉత్తర కొరియాకు చైనా మరో షాక్

ఇదిలా ఉండగా, ఉత్తర కొరియాకు ఎగుమతి చేసే చమురు సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చైనా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. చైనాలో ఉన్న ఉత్తర కొరియాకు చెందిన కంపెనీలను జనవరిలోపు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ దేశ కంపెనీలు, చైనా సంస్థలతో జాయింట్‌ వెంచర్‌ చేస్తున్న కంపెనీలను మూసివేసేందుకు 120 రోజుల గడువు ఇస్తున్నట్లు తాజా ఆదేశాల్లో పేర్కొంది.

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో కఠిన ఆంక్షలు

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో కఠిన ఆంక్షలు

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ఉత్తర కొరియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా తీర్మానంలో భాగంగానే ఈ చైనా ఈ నిర్ణయం తీసుకుంది.

ఉత్తర కొరియాకు వరుస షాక్‌లు

ఉత్తర కొరియాకు వరుస షాక్‌లు

ఉత్తర కొరియాకు ఎగుమతి చేసే చమురు సరఫరాపై ఆంక్షలు, అక్కడి నుంచి వచ్చే వస్త్ర దిగుమతులపై నిషేధం అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో చైనా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. శుద్ధి చేసిన పెట్రోలియం ఎగుమతులను ఏడాదికి 2 మిలియన్‌ బ్యారెల్స్‌కు పరిమితం చేసినట్లు చైనా గత వారం ప్రకటించింది.

English summary
North Korea claims that 4.7 million of its citizens have volunteered to join or re-enlist in the military since leader Kim Jong Un threatened to "tame” President Trump “with fire" last week, North Korean state media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X