వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాపై కిమ్ కన్ను: ఉ.కొరియా అమ్ములపొదిలో ఆ రేంజ్ క్షిపణులు..

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్: అణు దాడులతో అమెరికా వినాశనానికి రంకెలు వేస్తున్న ఉత్తరకొరియా.. దాని మిత్ర దేశాలను కూడా కట్టడి చేయాలనే వ్యూహంతో కదులుతోంది.

ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా దేశాల పైకి క్షిపణులను గురిపెట్టి భయపెట్టించిన ఉత్తరకొరియా.. తాజాగా ఆస్ట్రేలియాను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా రక్షణ శాఖ సీనియర్ అధికారి రాబర్ట్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా, దాని మిత్ర దేశాలను భయపెట్టడమే లక్ష్యంగా కిమ్ జాంగ్ వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాను టార్గెట్ చేయాలన్న కిమ్ ఆలోచనతో.. ఉత్తరకొరియాకు నిజంగా అంత సామర్థ్యం ఉందా?.. ఆస్ట్రేలియా దీన్ని ఎలా ఎదుర్కోబోతోంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొట్టిపారేయలేం:

కొట్టిపారేయలేం:

ఆస్ట్రేలియాపై ఉత్తరకొరియా దాడి చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు చెబుతున్నారు. దీన్ని అంత తేలిగ్గా విస్మరించడానికి లేదని, కిమ్ అన్నంత పనిచేసే రకమేనని అంటున్నారు.

గతం కన్నా తన అణు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్న ఉత్తరకొరియా.. మిగతా దేశాలు నోరు మెదపకుండా చేసేందుకైనా ఆస్ట్రేలియాపై దాడి చేయవచ్చునని రాబర్ట్ అభిప్రాయపడ్డారు.

ఉత్తరకొరియా అణ్వస్త్రాలు:

ఉత్తరకొరియా అణ్వస్త్రాలు:

ఉత్తరకొరియా కొత్తగా అభివృద్ది చేసుకున్న క్షిపణి దాదాపు 3500కి.మీ లక్ష్యాలను చేరుకోగలదు. అలాగే కేఎన్-17 ఐసీబీఎం క్షిపణి కూడా 5500కి.మీ లక్ష్యాలను చేరుకోగలదు.

గత జులై నెలలో కేఎన్14 అణుక్షిపణిని ఉత్తరకొరికా పరీక్షించింది. దాదాపు 6700కి.మీ దూరంలోని లక్ష్యాలను సైతం ఇది ధ్వంసం చేయగలదు. ఇక కేఎన్ 08 క్షిపణిని ఇంతవరకు పరీక్షించలేదని తెలుస్తోంది.

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

ఇదీ లెక్క:

ఇదీ లెక్క:

ఉత్తరకొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్ నుంచి అమెరికా ఆధీనంలోని గువాం 3402కి.మీ, సిడ్నీ 8515కి.మీ, మెల్ బోర్న్ 8763కి.మీ, బ్రిస్బేన్ 7914, పెర్త్ 7955కి.మీ, అడిలైడ్ 8325కి.మీ, హోబర్డ్ 9359కి.మీ దూరంలో ఉన్నాయి.

ప్రస్తుతం ఉత్తరకొరియా వీటి దరిదాపుల్లోకి వెళ్లగల అణుసామర్థ్యాన్ని కలిగి ఉంది. దాని ప్రభావం ఎలాగు చుట్టు పక్కల ప్రాంతాలపై కూడా ఉంటుంది కాబట్టి.. ఆస్ట్రేలియాకు పొంచి ఉన్న ముప్పు కొట్టిపారేయలేనిది. గువాం ద్వీపం 3402కి.మీ దూరంలోనే ఉన్నందునా.. దాన్ని పూర్తిగా ధ్వంసం చేయగల సామర్థ్యం ఉత్తరకొరియాకు ఉందనే చెప్పాలి.

8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?

అణ్వాస్త్రాల్లో వేగంగా పురోగతి:

అణ్వాస్త్రాల్లో వేగంగా పురోగతి:

అణ్వస్త్రాలను రూపొందించుకోవడంలో ఉత్తరకొరియా చాలా వేగంగా పురోగతి సాధించిందని అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ యుకియా అమానో పేర్కొన్నారు. వరుసగా ఆరుసార్లు అణు పరీక్షలు నిర్వహించడం దీనికి నిదర్శనమన్నారు. అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకతాటి పైకి వస్తే గానీ ఉత్తరకొరియాను ఎదుర్కొనలేమని అన్నారు.

కాగా, ఉత్తరకొరియా అణ్వస్త్ర తయారీ వెనుక రష్యా పాత్ర కీలకంగా ఉందన్న అనుమానాలున్నాయి. ఉక్రెయిన్ ఫ్యాక్టరీల్లో అణ్వస్త్ర తయారీకి రాకెట్ ఇంజిన్ల తయారీకి రష్యా సహకరిస్తుందన్న తెలుస్తోంది. చైనా వైఖరి కూడా ఉత్తరకొరియాను ఇన్నాళ్లు ప్రోత్సహించింది. ఇటీవల ఐరాస ఒత్తిడి మేరకు ఉత్తరకొరియాతో చైనా తమ వాణిజ్య సంబంధాలు నిలిపివేయడంతో ఆ దేశానికి గట్టి దెబ్బ తగిలింది.

English summary
IT WAS a stunning warning that made Australia sit up and take notice.Former Pentagon official Dr Brad Roberts said Australia needed to develop greater missile defences in the event of a North Korea missile strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X