వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉ. కొరియాలో పెను ప్రమాదం కుప్పకూలిన నూక్లియర్ బేస్, 200మంది మృతి

ఉత్తరకొరియాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పుంగ్గే-రీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం జపా

|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పుంగ్గే-రీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం జపాన్‌ మీడియా వెలుగులోకి తెచ్చింది.

జపాన్ మీడియా కథనం ప్రకారం.. అక్టోబర్‌ 10న మిలిటరీ సైట్‌ వద్ద నిర్మాణ పనులు చేప‌డుతుండ‌గా ఒక్కసారిగా సొరంగం కూలిపోయింది. దీంతో సొరంగంలో 100 మంది చిక్కుకుపోయారు.

North Korea nuclear base COLLAPSES killing at least 200 people

ఈ సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేప‌డుతుండ‌గా మిగిలిన భాగం వారిపై కూలిపోయింది. దీంతో మరో 100 మంది కూడా మృత్యువాతపడ్డారు. అంతేగాక, రేడియో ధార్మిక లీకేజీ కూడా సంభవించిందని సమాచారం.

అయితే, ఈ పెను ప్రమాదంపై ఇప్పటివరకు ఉత్తర కొరియా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల ఉత్తర కొరియా హైడ్రోజన్‌ బాంబ్‌ను పరీక్షించడంతో ఆ ప్రదేశం మొత్తం దెబ్బతింది. దీంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని జపాన్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

English summary
A TUNNEL at an underground North Korea nuclear site has collapsed with up to 200 people killed, according to reports. The collapse happened at the Punggye-ri nuclear test site in the north-east of the country on October 10, according to Japan’s TV Asahi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X