వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్దానికి ఉత్తరకొరియా: 6వ, అణుపరీక్ష చేసిన ఉ.కొరియా, భూకంపాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

సియోల్: ఉత్తరకొరియా మరో అణు పరీక్ష నిర్వహించినట్టుగా దక్షిణ సైనికాధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరకొరియా శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు పరిశీలించినట్టుగా మీడియా ప్రకటించిన కొద్దిగంటల్లోనే 6వ,సారి అణుపరీక్ష నిర్వహించినట్టుగా దక్షిణ కొరియా అభిప్రాయపడుతోంది.

ప్రత్యర్థులను నాశనం చేస్తాం, హైడ్రోజన్ బాంబు రె'ఢీ' చేసిన కిమ్ప్రత్యర్థులను నాశనం చేస్తాం, హైడ్రోజన్ బాంబు రె'ఢీ' చేసిన కిమ్

శత్రుదేశాలు తమ మీద దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టు ఉత్తరకొరియా ప్రకటించింది. అంతేకాదు తమ దేశాన్ని ఎదుర్కోనేందుకు శత్రువులు జంకేలా చర్యలను తీసుకొంటున్నారు.

ట్రంప్‌కు షాక్: అణ్వాయుధ పరీక్షలు ఆపే ప్రసక్తి లేదు: ఉత్తరకొరియాట్రంప్‌కు షాక్: అణ్వాయుధ పరీక్షలు ఆపే ప్రసక్తి లేదు: ఉత్తరకొరియా

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తన చర్యలతో ప్రత్యర్థులను గడగడలాడిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన హైడ్రోజన్ బాంబును ఉత్తరకొరియా తయారు చేసింది. ఈ హైడ్రోజన్ బాంబును కిమ్ పరిశీలించిన కొద్దిసేపటికే దక్షిణ కొరియా 6వ,సారి అణుపరీక్షలు నిర్వహించిందని సమాచారం.

కిమ్‌కు షాక్: నార్త్ కొరియాపై బాంబు దాడి, సూపర్ బాంబు, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలుకిమ్‌కు షాక్: నార్త్ కొరియాపై బాంబు దాడి, సూపర్ బాంబు, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు

ఉత్తరకొరియా ఎప్పుడు ఏం చేస్తోందోననే ఆందోళన అమెరికా సహ ప్రత్యర్థి దేశాలకు కలుగుతోంది. ఉత్తరకొరియాపై దాడి చేయాలంటే భయపడేలా కిమ్ వ్యూహరచన చేస్తున్నారు.

మరో అణుపరీక్ష నిర్వహించిన ఉత్తరకొరియా

మరో అణుపరీక్ష నిర్వహించిన ఉత్తరకొరియా

హైడ్రోజన్ బాంబును ఉత్తరకొరియా తయారు చేసింది. అయితే ఉత్తరకొరియా మరోసారి అణుపరీక్షలను నిర్వహించింది. ఈ మేరకు దక్షిణ కొరియా సైనికాధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు.ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతమైన సున్‌గ్జిబేగమ్‌లో 5.1 తీవ్రతతో పేలుడు సంబవించిందని సమాచారం. ఈ పేలుడు కారణంగా ఉత్తరకొరియాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని దక్షిణ కొరియా ప్రకటించింది.

భూకంప కేంద్రాన్ని గుర్తించిన చైనా

భూకంప కేంద్రాన్ని గుర్తించిన చైనా

చైనాలోని భూకంప కేంద్రం కూడ ఉత్తరకొరియాలో భూకంపం సంభవించిందని గుర్తంచింది. చైనా భూకంప కేంద్రం సమాచారం మేరకు ఉత్తరకొరియాలో ఇటీవల కాలంలో రెండవ దఫా భూకంపం సంబవించిందని తెలిపింది.ఆదివారం నాడు చోటుచేసుకొన్న భూకంప తీవ్రత 4.6 గా రిక్టర్ స్కేల్‌పై నమోదైంది.

8 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు

8 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు

8 నిమిషాల తేడాలో రెండు భూకంపాలు వాటిలినట్టు భూకంప కేంద్ర అధికారులు గుర్తించారు. తొలుత ఏర్పడిన భూకంపం ఏర్పడిన 8 నిమిషాల తర్వాత మరో భూకంపం ఏర్పడిందని అధికారులు గుర్తించారు. ఈ రెండు భూకంపాలు కూడ దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.

అణు పరీక్షల వల్లే భూకంపాలు

అణు పరీక్షల వల్లే భూకంపాలు

ఉత్తరకొరియాలోని కిమ్‌చెవాక్‌కు ఈశాన్య ప్రాంతంలోని 75 కి.మీ. దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది. ఉత్తరకొరియాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఉత్తరకొరియా మరిన్ని జాగ్రత్తలను తీసుకొంటుంది. అంతేకాదు యుద్దం వైపుగా ఉత్తరకొరియా సన్నాహాలు చేసుకొంటుంది. ఉత్తరకొరియాకు సరిహద్దులో ఉన్న చైనాకు చెందిన యాంగ్జీ పట్టణంలో సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించిందని చైనా ప్రకటించింది. ప్రజలు భయబ్రాంతులయ్యారు.

English summary
SOUTH Korea’s military says North Korea is believed to have conducted its sixth nuclear test.The shallow, 6.3 magnitude earthquake shook North Korea on Sunday, suggesting it had detonated a sixth nuclear device, hours after it said it had developed an advanced hydrogen bomb that possesses “great destructive power”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X