వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాక్: వరుస ఉపగ్రహల ప్రయోగం, కిమ్ నెక్ట్స్ ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

సియోల్:ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మరో ఆసక్తికరమైన చర్యకు శ్రీకారం చుట్టనున్నారని దక్షిణ కొరియా దేశం అభిప్రాయపడుతోంది. దక్షిణ కొరియాకు చెందిన నిఘావర్గాలకు అందిన సమాచారం మేరకు ఉత్తరకొరియా వరుసగా ఉపగ్రహలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం.

మాతోనే అమెరికాకు అణు ముప్పు, ప్రపంచంపై ప్రభావం: కిమ్ షాకింగ్ కామెంట్స్మాతోనే అమెరికాకు అణు ముప్పు, ప్రపంచంపై ప్రభావం: కిమ్ షాకింగ్ కామెంట్స్

వరుస అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలతో ప్రపంచదేశాలను భయబ్రాంతులకు గురిచేసిన ఉత్తరకొరియా.. మరో సంచలనానికి తెరతీసింది.ఉత్తరకొరియాకు కళ్లెం వేసేందుకు అమెరికా అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించింది.

అదంతా తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టేందుకే, ప్రతీకారచర్యలు తప్పవు: కిమ్అదంతా తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టేందుకే, ప్రతీకారచర్యలు తప్పవు: కిమ్

ఐక్యరాజ్యసమితి సహకారంతో ఉత్తరకొరియాపై ఆంక్షలను విధించారు. ఉత్తరకొరియా ప్రపందేశాల హెచ్చరికలను ఖాతరు చేయకుండా వ్యవహరించిన కారణంగానే ఆంక్షలను విధించాల్సి వచ్చిందని అమెరికా గుర్తు చేస్తోంది.

షాక్: 'వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్ ' దాడి వెనుక కిమ్: అమెరికాషాక్: 'వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్ ' దాడి వెనుక కిమ్: అమెరికా

 ఉపగ్రహల ప్రయోగం కోసం ఉత్తరకొరియా ప్లాన్

ఉపగ్రహల ప్రయోగం కోసం ఉత్తరకొరియా ప్లాన్

అంతరిక్షంలోకి వరుసగా ఉపగ్రహలను పంపేందుకు ఉత్తరకొరియా ప్లాన్ చేస్తోందని దక్షిణకొరియా నిఘా వర్గాలు ప్రకటించాయి.తమకు కూడ ఉపగ్రహాలను ప్రయోగించే హక్కు ఉందని ఉత్తరకొరియా అధికార పత్రిక కథనం ప్రచురించడాన్ని దక్షిణ కొరియా నిఘావర్గాలు ప్రస్తావిస్తున్నాయి.

త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం

త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం

ఉత్తరకొరియా త్వరలోనే క్వాంగ్‌యాంగ్‌సాంగ్‌-5 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉందని దక్షిణ కొరియా ప్రకటించింది.ఈ మేరకు దక్షిణకొరియాలోని మీడియా ఈ అంశాన్ని ప్రకటించింది.

ఆంక్షలతో ఇబ్బందేనా

ఆంక్షలతో ఇబ్బందేనా

ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది. వరుస అణుపరీక్షలు, క్షిపణి పరీక్షల కారణంగా ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలను విధించింది.ఈ ఆంక్షల కారణంగా ఉత్తరకొరియాకు ఉపగ్రహలను ప్రయోగించే అవకాశం లేదు.ఈ ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా త్వరలోనే ఉపగ్రహలను పరీక్షించే అవకాశం ఉందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు చెబుతున్నాయి.

 వరుస ఉపగ్రహలకు ఉత్తరకొరియా ప్లాన్

వరుస ఉపగ్రహలకు ఉత్తరకొరియా ప్లాన్

వరుసగా ఉపగ్రహలను ప్రయోగించేందుకు ఉత్తరకొరియా ప్లాన్ చేస్తోందని దక్షిణ కొరియా నిఘా వర్గాలకు సమాచారం అందింది.ఈ మేరకు ఉపగ్రహలను వరుసగా ప్రయోగించేందుకు ఉత్తరకొరియా ప్లాన్ చేసిందని దక్షిణ కొరియా ప్రకటిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో యూఎన్‌ సమావేశంలో మాట్లాడిన కిమ్‌ దేశ ప్రతినిధి ఉత్తరకొరియా ప్రజల సంక్షేమం కోసం, ఆర్థిక ప్రగతి కోసం ఉపగ్రహ ప్రయోగాలను చేయనుందని ప్రకటించారు.భారీగా కెమెరాలు, టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలను అమర్చిన ఉపగ్రహాన్ని ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి ఉత్తరకొరియా సిద్ధమౌతోందని దక్షిణ కొరియా నిఘావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

English summary
North Korea is preparing to launch a satellite, a Seoul newspaper said Tuesday, as outside observers warn that the nuclear-armed regime's space programme is a fig leaf for weapons tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X