వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యర్థులను నాశనం చేస్తాం, హైడ్రోజన్ బాంబు రె'ఢీ' చేసిన కిమ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగాంగ్:ఉత్తర కొరియా అత్యాధునిక హైడ్రోజన్ బాంబును తయారుచేసిందని ఆ దేశానికి చెందిన మీడియా ప్రకటించింది. ఈ బాంబు గతంలో తయారుచేసిన బాంబుల కంటే అత్యాధునికమైందని ప్రకటించింది. తమ శత్రుదేశాలపై దాడి చేసేందుకు ఉత్తరకొరియా ఈ బాంబును తయారుచేసిందని ఆ దేశ మీడియా ప్రకటించింది.

ట్రంప్‌కు షాక్: అణ్వాయుధ పరీక్షలు ఆపే ప్రసక్తి లేదు: ఉత్తరకొరియాట్రంప్‌కు షాక్: అణ్వాయుధ పరీక్షలు ఆపే ప్రసక్తి లేదు: ఉత్తరకొరియా

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వ్యవహరశైలితో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. కిమ్ ఎప్పుడు ఏం చేస్తారోననే ఆందోళన ప్రత్యర్థుల్లో నెలకొంది.

కిమ్‌కు షాక్: నార్త్ కొరియాపై బాంబు దాడి, సూపర్ బాంబు, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలుకిమ్‌కు షాక్: నార్త్ కొరియాపై బాంబు దాడి, సూపర్ బాంబు, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు

అదే సమయంలో ప్రత్యర్థుల నుండి తమను తాము రక్షించుకొనేందుకుగాను ఉత్తరకొరియా జాగ్రత్తలను తీసుకొంటుంది. ఇందులో భాగంగానే అణ్వాయుధ పరీక్షలు, ఖండాంతర క్షిపణులను తయారు చేస్తోంది.

కిమ్‌కు ట్రంప్ షాక్: ఖండాంతర క్షిపణి ప్రయోగించిన అమెరికా,ఇక మాటల్లేవ్కిమ్‌కు ట్రంప్ షాక్: ఖండాంతర క్షిపణి ప్రయోగించిన అమెరికా,ఇక మాటల్లేవ్

అమెరికా సహ ఇతర దేశాలు పలుమార్లు హెచ్చరించినా ఉత్తరకొరియా వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. తమ దేశ ప్రజలను కాపాడుకొనేందుకు తాము అణ్వాయుధాలను తయారు చేస్తున్నట్టుగా ఉత్తరకొరియా ప్రకటించింది.

హైడ్రోజన్ బాంబు రెఢీ చేసిన ఉత్తరకొరియా

హైడ్రోజన్ బాంబు రెఢీ చేసిన ఉత్తరకొరియా

ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును తయారుచేసింది.ఉత్తరకొరియా అణ్వాయుధ శక్తి సంపదలో హైడ్రోజన్ బాంబు కలికితురాయి వంటిందని కిమ్ అభిప్రాయపడ్డారు. హైడ్రోజన్ బాంబు దేశానికి గర్వకారణంగా చెప్పారని ఆ దేశ మీడియా ప్రకటించింది. తమ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఏ పనైనా ఎలాంటి ఫెయిల్యూర్స్ లేకుండా చేస్తారని కిమ్ కితాబిచ్చారు.

స్వదేశీ శక్తితో హైడ్రోజన్ బాంబు తయారీ

స్వదేశీ శక్తితో హైడ్రోజన్ బాంబు తయారీ


ఉత్తరకొరియా స్వశక్తితో హైడ్రోజన్ బాంబును తయారుచేసింది. అయితే ఈ బాంబు తయారీకి అవసరమైన ముడి బాగాలను ఉక్రెయిన్‌ నుండి ఉత్తరకొరియా దిగుమతి చేసుకొందని సమాచారం. గతంలో తయారుచేసిన హైడ్రోజన్ బాంబును మరింత ఆధునీకరించిందని ఉత్తరకొరియా మీడియా ప్రకటించింది. ఆయుధసంపత్తిని పెంచుకొంటూ ఉత్తరకొరియా ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.

 అణ్వాయుధాలను నాశనం చేయలేరన్న ఉత్తరకొరియా

అణ్వాయుధాలను నాశనం చేయలేరన్న ఉత్తరకొరియా


అణ్వాయుధాల స్థావరాన్ని అమెరికా సహ ఇతర దేశాలు నాశనం చేయడం కల మాత్రమేనని ఉత్తరకొరియా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరకొరియా అధికారిక సైట్ ఈ ప్రకటన చేసింది. తమ స్థావరాలను నాశనం చేయాలనుకోవడం ఒక వెర్రికల మాత్రమేనని ఉత్తరకొరియా ప్రకటించింది.

ఎప్పుడైనా యుద్దానికి సిద్దమేన్న ఉత్తరకొరియా

ఎప్పుడైనా యుద్దానికి సిద్దమేన్న ఉత్తరకొరియా


తమ దేశానికి చెందిన వ్యూహత్మక ఆయుధాలు ఊహించని ప్రాంతాలను ఎప్పుడైనా ఆక్రమించుకోవడానికి సిద్దంగా ఉన్నాయని ఉత్తరకొరియా ప్రకటించింది. అంతేకాదు ఆయా దేశాలను పూర్తిగా నిర్మూలించేందుకు కూడ సిద్దమేనని ప్రకటన చేసింది.ఇదిలా ఉంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తరకొరియాపై యుద్దానికిసిద్దమౌతున్నట్టు సంకేతాలను ఇస్తోంది.

English summary
North Korea has said it has developed a more advanced nuclear weapon that has "great destructive power” amid World War 3 fears.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X